Bigg Boss Telugu 7: హౌస్లో మొదలైన ప్రేమ కథలు, కుస్తీలో దండం పెట్టిన శివాజీ... 5 వారాలు నో ఎలిమినేషన్!
బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ కూడా ముగిశాయి. 14 మంది కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే కఠిన టాస్క్ పెట్టాడు.
Bigg Boss Telugu 7
చూస్తుంటే సీజన్ 7 కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగేలా ఉంది. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన షో ఒకింత ఆసక్తిరేపుతుంది. ఫస్ట్ డే నుండే కంటెస్టెంట్స్ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ప్రేమ కథలు కూడా చిగురిస్తున్నాయి.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu 7) లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా నేటి ఎపిసోడ్ పై క్యూరియాసిటీ పెంచేసింది. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ మాట్లాడుకుంటూ ఉండగా... అక్కడికి రతికా రోజ్ వచ్చింది. పల్లవి ప్రశాంత్ ని ఓ రొమాంటిక్ ప్రశ్న అడిగింది. ఈ ఇంట్లో నీ హార్ట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావ్? అని అడిగింది. ఈ ప్రశ్నకు ప్రశాంత్ కఠినమైన ప్రశ్న. నీ హార్ట్ ఎవరికి ఇస్తావ్..? అని తిరిగి అడిగాడు నీకే అని సమాధానం చెప్పింది. దాంతో ప్రశాంత్ మెలికలు తిరిగిపోయాడు.
Bigg Boss Telugu 7
రైతుబిడ్డ ట్యాగ్ తో సామాన్యుడిగా హౌస్లో అడుగుపెట్టిన ప్రశాంత్ కొంచెం జాగ్రత్తగా ఆడితే ఎక్కువ వారాలు ఉండే అవకాశం ఉంది. అతనికి ప్రేక్షకుల్లో సానుభూతి ఉంటుంది. కాబట్టి అలాంటి అబ్బాయి వెంటపడే అమ్మాయికి కూడా మైలేజ్ ఉంటుంది. రితికా అతడికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
Bigg Boss Telugu 7
అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కీలక టాస్క్ పెట్టాడు. ఏకంగా 5 వారాలు ఎలిమినేషన్ నుండి ఇమ్యూనిటీ పొందే ఛాన్స్ ఇచ్చాడు. అయితే టాస్క్ అంత ఈజీ కాదు. ప్రొఫెషనల్ పహిల్వాన్ లతో వారు కుస్తీ పట్టాల్సి ఉంది. ఎవరైతే పహిల్వాన్ ని ఓడిస్తారో వారికి ఐదు వారాల ఇమ్యూనిటీ లభిస్తుంది.
Bigg Boss Telugu 7
లేడీ కంటెస్టెంట్స్ అమ్మాయితో , జెంట్స్ అబ్బాయితో పోటీపడాలి. కండలు తిరిగి బలిష్టంగా ఉన్న ఆ కుస్తీ వీరులను చూసి కంటెస్టెంట్స్ కి చెమటలు పట్టాయి. టాస్క్ కావడంతో తప్పలేదు. బాహాయపడుతూనే వారితో పోటీపడ్డారు. శివాజీ అయితే దండం పెట్టాడు. ప్రిన్స్ యావర్ మాత్రం పోటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Bigg Boss Telugu 7
ఎలిమినేషన్ నుండి తప్పుకోవడానికి శక్తి వంచన లేకుండా కుస్తీ వీరులతో కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. మరి ఒక్కరైనా వారిని ఓడించి ఎలిమినేషన్ నుండి ఇమ్యూనిటీ పొందారా లేదా అనేది నేటి ఎపిసోడ్లో చూడాలి.
Bigg Boss Telugu 7
ఇక తొలి వారం నామినేషన్స్ లో షకీలా ఉంది. పల్లవి ప్రశాంత్, దామిని, ప్రిన్స్ యావర్, షకీలా, శోభిత శెట్టి, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఫస్ట్ వీక్ కావడంతో ఎలిమినేషన్ లేకపోవచ్చు. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ సీజన్ కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది.