- Home
- Entertainment
- గెటప్, సెటప్ మార్చేసిన పల్లవి ప్రశాంత్... పేద రైతులకు పంగనామం పెట్టి జల్సాలు చేస్తున్న రైతుబిడ్డ!
గెటప్, సెటప్ మార్చేసిన పల్లవి ప్రశాంత్... పేద రైతులకు పంగనామం పెట్టి జల్సాలు చేస్తున్న రైతుబిడ్డ!
పల్లవి ప్రశాంత్ గెటప్ సెటప్ మార్చేశారు. రైతుబిడ్డ కాస్తా అల్ట్రా మోడ్రన్ సెలబ్రిటీ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. వ్యవసాయం సంగతేమో కానీ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాడు...

Pallavi Prashanth
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో తన ప్రవర్తన, ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు. అందుకే జనాలు ఓట్లు వేసి గెలిపించారు. హౌస్ నుండి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ ప్రవర్తన మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. సక్సెస్ కిక్ లో పోలీసుల ఆదేశాలు ఖాతరు చేయకుండా విజయోత్సవ ర్యాలీ చేసి జైలుపాలు అయ్యాడు.
Pallavi Prashanth
కాగా పల్లవి ప్రశాంత్ గెలుపుకు దోహదం చేసిన అంశాల్లో మరొకటి.. అతడు ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని హామీ ఇవ్వడం. కంటెస్టెంట్స్ అందరూ ప్రైజ్ మనీ తమ సొంత ప్రయోజనాలకు, కొంత ఛారిటీకి వాడతామని చెప్పారు. పల్లవి ప్రశాంత్ మాత్రం మొత్తం రూ. 50 లక్షలు పేద రైతులకు పంచుతానని అన్నాడు.
ఫైనల్ లో ప్రిన్స్ యావర్ నాలుగో స్థానం వద్ద రేసు నుండి తప్పుకున్నాడు. హోస్ట్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 15 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు. దాంతో విన్నర్ పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ రూపంలో దక్కాయి. ఒక కారు, డైమండ్ నెక్లెస్ బహుమతులు వచ్చాయి. వాటి విలువ రూ. 30 లక్షలు.
Pallavi Prashanth
ప్రైజ్ మనీగా వచ్చిన రూ. 35 లక్షల్లో ట్యాక్స్ కటింగ్ పోను రూ. 16 లక్షలు పల్లవి ప్రశాంత్ కి వచ్చాయని సమాచారం. హౌస్లో ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ఈ మొత్తాన్ని పేద రైతులకు పంచాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి ఏడు నెలలు అవుతుంది. ఒక్క లక్ష రూపాయలు మాత్రమే పల్లవి ప్రశాంత్ దానం చేశాడు.
Pallavi Prashanth
మొదటి సహాయం చేసిన నెలలు గడిచిపోగా మరొక పేద రైతును అతడు ఆదుకుంది లేదు. దీంతో పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ విషయంలో మాట తప్పాడు. ఇక డబ్బులు దానం చేసే సూచనలు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేయడం కూడా తగ్గించాడు. సోషల్ మీడియాలో వ్యవసాయం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తున్నా... అవి ప్రచారం కోసమే..
Pallavi Prashanth
సోషల్ మీడియా ఆదాయం, ఇతర ప్రమోషన్స్ వలన వచ్చే సంపాదనతో హ్యాపీగా బ్రతికేస్తున్నాడట. సెలెబ్రిటీ హోదా అనుభవిస్తున్న పల్లవి ప్రశాంత్... షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళుతున్నాడని టాక్. తరచుగా హైదరాబాద్ వస్తున్న పల్లవి ప్రశాంత్ తన బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో విందులు,వినోదాలు, పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాడు.
Pallavi Prashanth
తాజాగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరైన శుభశ్రీ రాయగురు బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. ఈ వేడుకలో పల్లవి ప్రశాంత్ లుక్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. టోర్న్ జీన్స్, హుడీ జాకెట్ ధరించి అల్ట్రా మోడ్రన్ గా తయారయ్యాడు. రైతుబిడ్డ ట్రాన్స్ఫర్మేషన్ చూసి జనాల మైండ్ బ్లాక్ అవుతుంది.
Pallavi Prashanth
ఇక ప్రైజ్ మనీ పంచే విషయంలో పల్లవి ప్రశాంత్ గురువు శివాజీ కూడా మాట తప్పాడు. పైగా పల్లవి ప్రశాంత్ ని శివాజీ వెనకేసుకొస్తున్నాడు. మాట ఇచ్చి తప్పిన రాజకీయ నాయకులను కూడా మీరు ఇలా నిలదీయగలరా అని ఎదురుదాడి చేశారు. మొత్తంగా పేద రైతులకు పల్లవి ప్రశాంత్- శివాజీ పంగనామాలు పెట్టారు...