Bigg Boss Telugu 7: టైటిల్ రేసులో వేగంగా మారుతున్న లెక్కలు... ఆ ముగ్గురిలో విన్నర్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు 7 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ మొదలు కాగా ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. అంచనాలకు మించిన టీఆర్పీ దక్కింది. మేకర్స్ కూడా ఫుల్ హ్యాపీ. 14 మందితో షో మొదలు కాగా ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరో 5గురు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. నాలుగవ వారం ఎలిమినేట్ అయిన రతిక రీఎంట్రీ ఇచ్చింది.
Bigg Boss Telugu 7
కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి, సందీప్, తేజ, భోలే, అశ్విని, రతిక వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో టాప్ 8 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో టాప్ 5 ఫైనల్ కి వెళతారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు.
శోభ, గౌతమ్, యావర్, అర్జున్ లలో ఒకరు మాత్రమే ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉందని అంచనా. అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. శోభ మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది. గౌతమ్ ఒకసారి ఎలిమినేట్ అయ్యాడు. సెకండ్ ఛాన్స్ ఇవ్వడంతో సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు. రతిక ఎంట్రీ అనంతరం యావర్ గేమ్ తగ్గింది.
Bigg Boss Telugu 7
ఇక ఖచ్చితంగా ఫైనల్ లో ఉంటారన్న లిస్ట్ లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక ఉన్నారు. టాప్ సెలెబ్స్ గా అమర్ దీప్, ప్రియాంకలకు ఫాలోయింగ్ ఉంది. అమర్ దీప్ హౌస్లో సాధించింది ఏం లేదు. చెప్పుకోవడానికి అమర్ దీప్ కి ఒక్క అచీవ్మెంట్ లేదు. పైగా వెర్రిమాలోకం అనే ముద్రపడింది. అయినా అతడు ఫైనల్ లో ఉంటాడని సమాచారం.
ప్రియాంక హౌస్లో సత్తా చాటింది. ఆమె ఇంటికి కెప్టెన్ అయ్యింది. కొని టాస్క్ లలో అబ్బాయిలతో పోటీ పడింది. ప్రియాంక స్ట్రాంగ్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. టాప్ 5 లో ప్రియాంక ఉంటుంది.
శివాజీ, ప్రశాంత్ ఖచ్చితంగా ఫైనల్ లో ఉంటారు. కారణం మొదటి నుండి టైటిల్ ఫేవరేట్స్ గా వీరు ప్రచారం అవుతున్నారు. శివాజీ మైండ్ గేమ్ ఆడుతూ టైటిల్ రేసులోకి వచ్చాడు. ఈ సీజన్ విన్నర్ శివాజీనే అనే మాట వినిపిస్తుంది. అయితే శివాజీకి పల్లవి ప్రశాంత్ నుండి గట్టి పోటీ ఉంది.
రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ కి జనాల్లో సింపథీ ఉంది. తన ఆట తీరుతో స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యాడు. గత 12 వారాల్లో పల్లవి సాధించిన విజయాలు అనేకం ఉన్నాయి. కేవలం సింపథీతో నెట్టుకొస్తున్నాడనే విమర్శలను తన విజయాలతో కొట్టిపారేశాడు. ప్రశాంత్ పవర్ అస్త్ర గెలిచాడు. బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్ అయ్యాడు. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు.
ఈ క్రమంలో టైటిల్ విషయంలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ మధ్య శివాజీ కంటే కూడా ప్రశాంత్ కి ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. అలాగే అమర్ దీప్ కూడా టైటిల్ రేసులో ఉన్నాడు. అమర్ కెప్టెన్సీ విషయంలో కఠినంగా ఉన్న శివాజీ కొంత బ్యాడ్ అయ్యాడు. అదే సమయంలో అమర్ దీప్ కి అది ప్లస్ అయ్యింది. కాబట్టి శివాజీ, అమర్, ప్రశాంత్ లలో టైటిల్ ఒకరికి దక్కే అవకాశం కలదు. వీరిలో పల్లవి ప్రశాంత్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా...