- Home
- Entertainment
- Bigg Boss Telugu7: మాయాస్త్ర కోసం తన్నుకునే వరకూ వెళ్లిన వ్యవహారం... ఐ వాంట్ జస్టిస్ అంటూ ప్రిన్స్ యావర్ ఫైర్!
Bigg Boss Telugu7: మాయాస్త్ర కోసం తన్నుకునే వరకూ వెళ్లిన వ్యవహారం... ఐ వాంట్ జస్టిస్ అంటూ ప్రిన్స్ యావర్ ఫైర్!
బిగ్ బాస్ హౌస్లో వాతావరణం వేడెక్కింది. ప్రిన్స్ యావర్-గౌతమ్ కృష్ణ మధ్య సీరియస్ వాగ్వాదం నడిచింది. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండుగా విభజించిన విషయం తెలిసిందే. రణధీర టీమ్ లో శివాజీ, షకీలా, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇక మహాబలి టీంలో తేజా, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ, దామిని, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్ ఉన్నారు. బిగ్ బాస్ నిర్వహించిన రెండు రౌండ్స్ లో రణధీర టీమ్ గెలిచింది. అందుకే మాయాస్త్ర వారి సొంతం అయింది. రణధీర టీంలో ఉన్న 6గురు సభ్యుల్లో ఒకరికి పవర్ అస్త్ర దక్కనుంది.
Bigg Boss Telugu 7
ఈ ఆరుగురు సభ్యుల్లో ఎవరు మాయాస్త్ర, పవర్ అస్త్ర పొందేందుకు అర్హులో మహాబలి టీమ్ లో ఉన్న 6 మంది నిర్ణయించాలి. రణధీర టీమ్ కి చెందిన ఆరుగురు కంటెస్టెంట్స్ వద్ద ఉన్న మాయాస్త్ర భాగాలు ఉన్నాయి. వారిలో అర్హుడు కాదని భావించిన ఒక కంటెస్టెంట్ వద్ద తీసుకుని అర్హుడు అనుకున్న మరొక కంటెస్టెంట్ కి మాయాస్త్ర భాగం మహాబలి టీమ్ సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చి ఇవ్వాలి. దామిని ప్రియాంక వద్ద తీసుకుని షకీలాకు ఇచ్చింది. పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ వద్ద తీసుకుని శివాజీకి ఇచ్చాడు.
Bigg Boss Telugu 7
మహాబలి టీమ్ లో ఉన్న రతికా కారణంగా అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక పవర్ అస్త్ర కంటెండర్ అయ్యే ఛాన్స్ కోల్పోయారు. ఇక రేసులో షకీలా, ప్రిన్స్ యావర్, శివాజీ ఉన్నారు. గౌతమ్ కృష్ణ ప్రిన్స్ యావర్ అనర్హుడని అతని వద్ద ఉన్న మాయాస్త్ర భాగాలు శివాజీకి ఇస్తాను అన్నాడు. అందుకు ప్రిన్స్ ఫైర్ అయ్యాడు. ఎందుకు? నాకు వ్యాలిడ్ రీజన్ కావాలన్నాడు. శివాజీ గేమ్ మీరందరూ ఎగ్జిక్యూట్ చేశారని గౌతమ్ కృష్ణ అన్నాడు.
Bigg Boss Telugu 7
ఇది వివాదానికి దారి తీసింది. ప్రిన్స్ యావర్ ఫైర్ అయ్యాడు. గౌతమ్ కృష్ణ మీదకు దూసుకెళ్లాడు. పర్సనల్ గా తీసుకుని ఇలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకరి మీదకు మరొకరు వెళ్లడంతో కొట్టుకునే వరకు వెళ్ళింది.
Bigg Boss Telugu 7
ప్రిన్స్ యావర్ నాకు జస్టిస్ కావాలని కేకలు వేశాడు. చేతిలో ఉన్న మాయాస్త్ర భాగాలు విసిరి కొట్టి ఇంట్లో నుండి వెళ్లిపోతానని అన్నాడు. ప్రిన్స్ ఎమోషనల్ కాగా అమర్ దీప్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. నేడు శుక్రవారం ఎపిసోడ్ వాడి వేడిగా సాగనుందని అర్థం అవుతుంది.