భగవంత్ కేసరిలో బిగ్ బాస్ 7 బ్యూటీ రతికా రోజ్.. ఆమె కనిపించగానే ఈలలు కేకలు, లేడీ మినిస్టర్ పాత్రలో
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం భగవంత్ కేసరి నేడు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం భగవంత్ కేసరి నేడు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మధ్యలో కొంత లాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా అనిల్ రావిపూడి ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ చిత్రాన్ని తెరకెక్కించారు అంటూ రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో బాలయ్య కుమార్తె పాత్రలో శ్రీలీల నటించగా.. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ మెరిసింది. డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి అంటూ రెస్పాన్స్ వస్తోంది. కొంత మిక్స్డ్ రెస్పాన్స్ కూడా వస్తోంది.
బాలయ్య కోసం అనిల్ రావిపూడి సరికొత్తగా తెరకెక్కించిన చిత్రం ఇది అని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో ఒక స్పెషల్ పాత్ర ఆడియన్స్ అందరిని థ్రిల్ చేసే విధంగా ఉంది. ఆ పాత్రలో నటించింది ఎవరో కాదు.. రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొని సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న రతికా రోజ్. హౌస్ లో కొన్ని రోజులే ఉన్న రతికా త్వరగానే ఎలిమినేట్ అయింది.
అయితే రతికా రోజ్ కొన్ని రోజుల్లోనే ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ గా, గ్లామర్ బ్యూటీగా పాపులారిటీ సొంతం చేసుకుంది. రతికా రోజ్ కి అనిల్ రావిపూడి భగవంత్ కేసరి చిత్రంలో గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు. భగవంత్ కేసరి చిత్రంలో రతికా రోజ్ చిన్న కీలక పాత్రలో మెరిసింది. లేడి మినిస్టర్ పాత్రలో రతికా కనిపించింది.
ఆమె స్క్రీన్ పై కనిపించగానే థియేటర్స్ లో ఆడియన్స్ ఈలలు కేకలతో హోరెత్తిస్తున్నారు. ఆమె పాత్రని అనిల్ రావిపూడి ఫన్నీగా ప్రెజెంట్ చేశారు. రతికా పాత్రకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం ఆమె క్రేజ్ కి నిదర్శనం.
రతికా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఇతర సభ్యులతో గొడవలు ఎక్కువగా పెట్టుకోవడం చూశాం. ఎలాంటి అయినా రతికా వాదనలకు దిగడంతో ఆమెపై నెగిటివిటీ ఏర్పడడం ఫలితంగా ఓటింగ్ లో వెనకబడి ఎలిమినేట్ అయింది అని అంటున్నారు.