Bigg Boss Telugu 7: వాళ్ళ అంతు చూస్తా అన్న శివాజీ, ప్యాంటు విప్పేస్తా అంటూ శోభా మీద ఫైర్ అయిన డాక్టర్ బాబు!
బిగ్ బాస్ షో మూడో వారంలో అడుగుపెట్టింది. 17వ రోజు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. అవేమిటో చూద్దాం...
Bigg Boss Telugu 7
శివాజీ పవర్ అస్త్ర గెలిచిన విషయం తెలిసిందే. రెండవ కంటెండర్ గా ఎంపికైన శివాజీ 4 వారాల ఇమ్యూనిటీ పొందాడు. అయితే ఈ పవర్ అస్త్రను శివాజీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంది. అమర్ దీప్ చౌదరి అతడు నిర్లక్ష్యంగా ఉండటం చూసి కాజేశాడు. తన పవర్ అస్త్ర ఎవరో కాజేశారని తెలుసుకున్న శివాజీ... దీని వెనకున్న మాస్టర్ మైండ్ అంతు చూస్తా అన్నాడు.
Bigg Boss Telugu 7
ప్రిన్క్ యావర్ కి గాలం వేస్తున్న రతికా రోజ్ ప్లాన్ సక్సెస్ అని చెప్పాలి. అతడు పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు. మూడో కంటెండర్ రేసులో ఉన్న యావర్ అర్హుడు కాదని రతికా చెప్పింది. అయినా ఆమె పట్ల యావర్ కోపం చూపించలేదు. నీకు నేను ఉన్నాను అని హామీ ఇచ్చాడు. ఇద్దరు ఒకే ప్లేట్ లో భోజనం చేశారు. దాంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారు.
Bigg Boss Telugu 7
ఇక మూడో కంటెండర్ గా రేసులో శోభా శెట్టి, అమర్ దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్ ఉన్నారు. వీరిలో మొదటి పరీక్ష యావర్ కి పెట్టాడు. ఇంటి సభ్యులు ఏం చేసినా ఒక స్థానం నుండి ముఖం తీయకూడదని ఆదేశించాడు. ఈ గేమ్ లో యావర్ ని తేజ, దామిని, రతికా బాగా డిస్టర్బ్ చేశారు. గడ్డి, పేడ కూడా వేశారు. అయినా యావర్ టాస్క్ గెలిచాడు.
Bigg Boss Telugu 7
అనంతరం కంటెండర్ రేసులో ఉన్న శోభా శెట్టికి అర్హత లేదని కన్ఫెషన్ రూమ్ లో చెప్పిన వారి వీడియోలు బిగ్ బాస్ ప్రదర్శించాడు. శోభా శెట్టికి అర్హత లేదని ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ చెప్పారు. అయితే గౌతమ్ కృష్ణ విషయంలో ఆమె ఫైర్ అయ్యారు. ఇద్దరి మధ్య సీరియస్ వాగ్వాదం నడిచింది. గౌతమ్ కృష్ణ చొక్కా తీసేశాడు. తిక్క రేగితే ప్యాంటు కూడా తీసేస్తాను అన్నాడు.
Bigg Boss Telugu 7
హౌస్లో ఉండేందుకు నీకు అర్హత లేదని గౌతమ్ అన్నాడు. నీకంటే ఎక్కువ రోజులు హౌస్లో ఉండి చూపిస్తా అని శోభా శెట్టి ఛాలెంజ్ చేసింది. మొత్తంగా ఇలాంటి ఆసక్తికర విషయాలతో షో ముగిసింది. ఈ వారం ప్రియాంక, అమర్ దీప్, దామిని, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, రతికా రోల్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఇకను ఎలిమినేట్ కానున్నారు.