Bigg Boss Telugu 7 contestants Remuneration: ఈ సీజన్‌లో అత్యధికంగా తీసుకునేదేవరు? మరీ తక్కువగా ఎవరికంటే?
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమై వారం అవుతుంది. మొదటి వారం ఎలిమినేషన్ కూడా ఈ రోజు(శనివారం) నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈసారి హౌజ్‌కి వచ్చిన వారి పారితోషికాలు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. మరి ఎవరికి ఎంత ఇస్తున్నారనేది ఓ లుక్కేద్దాం.
బిగ్ బాస్ లోకి కొందరు పాపులర్ సెలబ్రిటీలను బిగ్ బాస్ నిర్వహకులు తీసుకొస్తారు. కొందరిని జల్లెడ పట్టి ఎంపిక చేస్తారు. చాలా వరకు క్రేజ్ ఉన్న వారికి కంటెంట్ ఉన్న వారికి ప్రయారిటీ ఇస్తారు. పారితోషికాల విషయానికి వచ్చినప్పుడు క్రేజ్, పాపులారిటీ, వాళ్లు బయట ఎంత సంపాదిస్తున్నారనేదాని బట్టి రెమ్యూనిరేషన్స్ ఇస్తుంటారు. మరి ఈ సీజన్‌లో వచ్చిన కంటెస్టెంట్లకి ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఎక్కువగా, ఎవరికి తక్కువ అనేది తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్ గా శివాజీ పేరు వినిపిస్తుంది. ఆయనకు వారానికి నాలుగు లక్షలు ఇస్తున్నట్టు సమాచారం. రోజుకి ఆయనకు 60 వేల వరకు అందిస్తున్నట్టు టాక్.
ఆ తర్వాత స్థానంలో షకీలా ఉన్నారట. ఒకప్పుడు శృంగార కథానాయికగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న షకీలా కి భారీగానే పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. ఆమెకి వారానికి 3-3.5లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తుంది. రోజుకి యాభై వేల వరకు అందుకుంటుందని టాక్.
సోషల్ మీడియాలో విపరీతమైన పాలోయింగ్ కలిగిన కిరణ్ రాథోర్ గట్టిగా అందుకుంటుంది. ఆమె వారానికి ఏకంగా మూడు లక్షలు తీసుకుంటుందని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలతో దుమ్మురేపే కిరణ్ రాథోర్‌కి అక్కడ మూడు మిలియన్స్ ఫాలోయింగ్ ఉండటం విశేషం. ఈ లెక్కన కిరణ్ రాథోర్ రోజుకి నలభై వేలకు పైగానే పారితోషికం అందుకుంటుంది.
ఇటీవల డాన్సు షోలో విన్నర్‌గా నిలిచారు ఆట సందీప్. డాన్సు మాస్టర్‌గా ఆయనకు మంచి లైఫ్ ఉంది. క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆట సందీప్‌కి వారానికి 2.75లక్షలు పారితోషికంగా అందిస్తున్నట్టు సమాచారం. రోజుకి నలభై వేలు పారితోషికంగా అందుకుంటున్నారు.
సీరియల్స్ లో పాపులర్ అయ్యింది ప్రియాంక జైన్. ఆమె ఓ రకంగా బుల్లితెర స్టార్‌గా రాణిస్తుంది. ఆమె పారితోషికం గట్టిగానే ఉంది. ఆమెకి వారానికి రెండు లక్షల నలభై వేలు అందుకుంటుంది. రోజుకి దాదాపు ఆమె రూ.35 వేల వరకు అందుకుంటుంది.
సీరియల్స్ హీరోగా పాపులారిటీ సొంతం చేసుకున్న అమర్ దీప్ సైతం బిగ్ బాస్‌లోకి వచ్చారు. ఆయనకు వారానికి రెండున్నర లక్షల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. రోజుకి 35వేలకుపైగానే పారితోషికం అందుకుంటున్నాడు.
పాపులర్ సింగర్‌గా రాణిస్తుంది దామిని భట్ల. ఆమె ఎన్నో భక్తి పాటలు పాడారు. సింగర్‌గా బిజీగా ఉన్నారు. ప్రతి సీజన్‌లో ఒక సింగర్‌గా బిగ్‌బాస్‌లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఏడో సీజన్‌లో దామిని వచ్చారు. ఆమెకి వారానికి పారితోషికం రెండు లక్షలు ఇస్తున్నట్టు సమాచారం. రోజుకి ముప్పై వేల వరకు ఇస్తున్నట్టు టాక్.
హీరోయిన్‌గా ఒకటి రెండు సినిమాలు చేసిన రతిక కూడా బాగానే అందుకుంటుంది. ఆమెకి వారానికి రెండు లక్షలు ఇస్తున్నారట. ఈ లెక్కన ఆమె రోజుకి 30వేలు పొందుతుంది. మరోవైపు హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌తో పులిహోర కలుపుతూ హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే.
`కార్తికదీపం`లోని మోనితా పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది శోభా శెట్టి. సీరియల్స్ తో బిజీగా ఉన్న నటి. కావడంతో ఎక్కువగానే డిమాండ్ చేసిందట. ఆమెకి వారానికి 2.25లక్షల పారితోషికం అందుకుంటుందని తెలుస్తుంది. ఈ లెక్కన ఆమె రోజుకి 32వేలు తీసుకుంటుంది.
టేస్టీ తేజ యూట్యూబ్ ద్వారా పాపులర్. వంటల వీడియోలు చేస్తూ ఆకట్టుకున్న ఆయన హౌజ్‌లో తనదైన కామెడీతో మెప్పిస్తున్నాడు. ఆయనకు వారానికి లక్షా యాభై వేల వరకు అందుకుంటున్నాడట. రోజుకి ఇరవై వేలకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం.
లాయర్ అయ్యుండి.. నటిగా మారింది శుభ శ్రీ. ఆమె నటిగా రాణించే ప్రయత్నం చేస్తుంది. యూట్యూబ్ నటిగా పేరుతెచ్చుకుంది. ఒకటి రెండు సినిమాల్లోనూ మెరిసిందట. తనకు వారానికి రెండు లక్షల పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ లెక్కన రోజుకి ముప్పై వేల వరకు పారితోషికం అందుకుంటుంది.
సినిమాపై ప్యాషన్‌తో డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యాడు గౌతం కృష్ణ. హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు. అతనికి వారానికి లక్షా 75 వేలు పారితోషికంగా ఇస్తున్నారట. రోజుకి 25వేలు అందుకుంటున్నట్టు సమాచారం
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ లోకి వచ్చిన ప్రిన్స్ యావర్‌కి మామూలు పారితోషికమే అందుకుంటున్నారు. ఆయనకు వారానికి లక్షా యాభై వేలు అందిస్తున్నట్టు సమాచారం. ఆయనకు రోజుకి ఇరవై వేల వరకు దక్కుతుందని చెప్పొచ్చు.
రైతు బిడ్డ, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్‌కి మాత్రం చాలా తక్కువగానే ఇస్తున్నారట. ఆయనకు వారానికి లక్ష వరకు ఇస్తున్నారని సమాచారం. రోజుకి ఆయనకు 15వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్.. హీరోయిన్ రతికతో పులిహోర కలుపుతూ చర్చనీయాంశం అవుతున్నాడు. ఇవన్నీ ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో, సోషల్ మీడియా ద్వారా వినిపించేటువంటి లెక్కలు. వాస్తవం ఏంటనేది మాత్రం పూర్తిగా రహస్యంగా ఉంచుతారు.