Bigg Boss Telugu 7: శివాజీ కొడుకు వస్తే శోభ శెట్టి అతి ఏంటీ? డ్రామా క్వీన్ పిచ్చి పీక్స్!
బిగ్ బాస్ హౌస్లో డ్రామా క్వీన్ గా పేరు తెచ్చుకుంది శోభ శెట్టి. చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఆడియన్స్ ని హింసించేస్తుంది.
Bigg Boss Telugu 7
శోభ శెట్టి గేమ్, యాటిట్యూడ్, అతి చూడలేక ఆడియన్స్ తలలు బాదుకుంటున్నారు. ఆమెని పంపేయండి బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. శోభను కాపాడేందుకు స్టార్ మా చేయాల్సిందంతా చేస్తున్నారు. నయని పావని, సందీప్, తేజలతో పోల్చుకుంటే ఆమె వరస్ట్ ప్లేయర్ అంటున్నారు ఆడియన్స్.
Bigg Boss Telugu 7
ఓవర్ అగ్రేషన్, నోటికి వచ్చింది మాట్లాడటం, ఊరికే కన్నీళ్లు పెట్టుకోవడం, చిన్న చిన్న ఆనందాలకు అతి చేయడం శోభ శెట్టికి కామన్ అయిపోయింది. ఈ డ్రామా క్వీన్ ఓవర్ యాక్షన్ పీక్స్ చేరిందనిపిస్తుంది. శివాజీ కొడుకు వస్తే ఈమె ఓవర్ రియాక్ట్ కావడం చూస్తే... ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి సామెత గుర్తొచ్చింది.
Bigg Boss Telugu 7
శివాజీ కొడుకు డాక్టర్ వేషంలో వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. ముసుగులో ఉన్న కొడుకును శివాజీ నిజంగానే డాక్టర్ అనుకున్నాడు. తర్వాత నాన్న అని మాస్క్ తీయడంతో శివాజీ షాక్ అయ్యాడు. మెడికల్ రూమ్ నుండి బయటకు వస్తూ... మై సన్.. అంటూ శివాజీ ఇంటి సభ్యులకు పరిచయం చేశాడు.
శోభ గట్టిగా అరుస్తూ గాల్లోకి ఎగిరింది. ఆమె కేకలు, ఎగ్జైట్మెంట్ చూసి హౌస్ మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత అర్జున్ భార్య సురేఖకు సీమంతం జరిగితే ఈమె ఎమోషనల్ అయ్యింది. కన్నీరు పెట్టుకుంది. కంటెంట్ ఇవ్వడం కోసం అవసరం లేనివి కూడా చేస్తుంది.
స్టార్ మా వాళ్ళు ఆమె ఏం చేసిన హైలెట్ చేసి చూపిస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఆడియన్స్ ఎంత మొత్తుకున్నా, శోభకు ఓట్లు పడకున్నా ఆమెను ఇంటి నుండి బయటకు పంపే ఛాన్స్ లేదు. శోభ ఫైనలిస్ట్స్ లో ఒకరని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Bigg Boss Telugu 7
శోభను కాపాడేందుకు ఓట్లతో సంబంధం లేకుండా సందీప్, తేజ ఎలిమినేషన్ జరిగిందనే ప్రచారం జరుగుతుంది. సీరియల్ బ్యాచ్ గా పేరుగాంచిన ప్రియాంక, శోభ, అమర్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ముగ్గురు మొదటి నుండి గ్రూప్ గా ఆడుతున్నారు. వీరి గ్రూపిజం చూసి, శివాజీ గ్రూప్ తయారైంది...