Priyanka Jain: హౌస్లో ఇంజెక్షన్స్, పిల్స్ వాడాను, విన్నర్ నేనే కావాల్సింది... శివాజీ జెన్యూన్ కాదు!
బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ మొదటిసారి ఓపెన్ కామెంట్స్ చేసింది. శివాజీ మాస్టర్ మైండ్ తో గేమ్ ఆడాడు. అతని నటన ఎవరికీ అర్థం కాలేదంటూ దుయ్యబట్టింది.
Priyanka Jain
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా, అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ కి గాను ఫైనల్ కి ఒకే ఒక లేడీ కంటెస్టెంట్ వెళ్లారు. ఆమె ప్రియాంక జైన్. స్ట్రాంగ్ ప్లేయర్ గా హౌస్లో సత్తా చాటిన ప్రియాంక జైన్ లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
ప్రియాంక మాట్లాడుతూ... నాకు హౌస్లో ఆరోగ్యం బాగోలేదు. ఇంజక్షన్స్, పిల్స్ వాడాను. నా పనులు నేను చేసుకోలేని పరిస్థితుల్లో హౌస్లో ఉన్న వాళ్లకు పనులు చేసి పెట్టలేదని హైలెట్ చేశారు. అనారోగ్యం కారణంగా నేను ఒక రోజు రోటీలు ఉదయానికి దాచుకున్నాను. అది హైలెట్ చేసి చూపారు.
నేను రోటీలు దాచుకోకపోతే స్పై బ్యాచ్ వాళ్ళు తినేస్తారు. ప్రతి రోజు రాత్రి తిని కూడా స్పై బ్యాచ్ ఉదయానికి రోటీలు దాచుకుంటారు. ఇవేమీ చూపించలేదు. నేను ఈ పాయింట్ మాట్లాడితే దాన్ని కూడా ఎడిట్ చేశారు.
బిగ్ బాస్ ఇవన్నీ చూపించి ఉంటే విన్నర్ అయ్యేదాన్ని. అందరూ వంద శాతం ఇస్తే నేను వెయ్యి శాతం ఇచ్చాను. నిజానికి విన్నర్ నేనే కావాలి. గ్రూప్ గా ఆడటం వలన టైటిల్ దూరమైంది అంటే నేను నమ్మను. గౌతమ్ గురించి స్టాండ్ తీసుకున్నదాన్ని హైలెట్ చేశారు. నేను ఫ్రెండ్ కంటే బ్రదర్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చాను.
అందుకే ముందు గౌతమ్ కి సపోర్ట్ చేశాను. తర్వాత గౌతమ్ చేత అమర్ కి సపోర్ట్ చేయించాను. నేను హౌస్లో స్ట్రాటజీలు ప్లే చేయలేదు. అలా చేసి ఉంటే టాప్ లో ఉండేదాన్ని. కొందరు పనులు చేయకుండా ప్రశాంతంగా స్ట్రాటజీలు ప్లే చేస్తూ గేమ్ ఆడారు. నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు శివాజీ వద్ద సమాధానం లేదు.
Priyanka Jain
శివాజీ నేను అబద్దాలు ఆడుతున్నానని అనేవారు. చేయని తప్పు చేశానంటే నాకు కోపం వచ్చింది. శివాజీకి నేను దగ్గర కావాలని చూశాను. కావాలనే నన్ను దూరం పెట్టారు. ఆయన మాస్టర్ మైండ్ తో గేమ్ ఆడాడు. శివాజీ జెన్యూన్ కాదు. హౌస్లో నాకు ఆ విషయం అర్థం అయ్యింది.
Priyanka Jain
శివాజీ ఏంటో మాకు కనబడుతుంది, జనాలకు ఎందుకు కనబడటం లేదు అనిపించేది. ఆయన ఎప్పుడూ మాస్క్ తోనే ఉన్నాడు. వంద రోజులు కాదు వెయ్యి రోజులు అయినా అలానే నటించగలడు... అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
Pic Credit: Never endig tales