బిగ్ బాస్ హౌస్ ని బెడ్ రూమ్ లా మార్చేసిన ప్రియాంక... అందరి ముందే ప్రియుడితో ఘాటు రొమాన్స్
బిగ్ బాస్ హౌస్లోకి ప్రియాంక జైన్ ప్రియుడు వచ్చాడు. వస్తూనే ప్రియాంక జైన్ ని ముద్దుల్లో ముంచెత్తాడు. ప్రియాంక-శివ కుమార్ రొమాన్స్ టూ మచ్ అని చెప్పాలి.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 పదవ వారంలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. హౌస్ మేట్స్ ని కలిసేందుకు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా వస్తున్నారు. శివాజీ కోసం కొడుకు కెన్నీ వచ్చాడు. అర్జున్ భార్య సురేఖ, అశ్విని తల్లి రావడమైంది. నేడు గౌతమ్ తల్లి వచ్చారు. ప్రియాంక కోసం మాత్రం ప్రియుడు వచ్చాడు.
Bigg Boss Telugu 7
ఓ సాంగ్ ప్లే కాగానే ఎవరో వస్తున్నట్లు హౌస్ మేట్స్ కి హింట్ వస్తుంది. డోర్లు తెరుచుకోగా సీరియల్ నటుడు శివ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రియాంక కోసం ఓ గులాబీ తెచ్చాడు. రొమాంటిక్ పోజులో ఆమెకు ఇచ్చాడు. ఇక ఆలస్యం చేయకుండా ముద్దులతో ముంచెత్తాడు.
Bigg Boss Telugu 7
చుట్టూ కెమెరాలు, హౌస్ మేట్స్ ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోలేదు. ప్రియాంకను ముద్దులతో ముంచెత్తాడు. హగ్గులతో చుట్టేశాడు. వీరి రొమాన్స్ చూసి అర్జున్ ఏమైనా అడ్డు పెట్టనా అని అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో వారి కెమిస్ట్రీ నడిచిందో.
Bigg Boss Telugu 7
చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ ని ప్రియాంక-శివ కుమార్ బెడ్ రూమ్ గా మార్చేశారు. హౌస్ మేట్స్ కొంచెం ఇబ్బంది పడుతూ వాళ్ళను చూస్తూ ఉండిపోయారు. నిజంగా వీరి మధ్య అంత ఘాడమైన ప్రేమ ఉందా లేక కంటెంట్ ఇస్తున్నారా? అనే సందేహాలు కలిగాయి.
Bigg Boss Telugu 7
నాన్ స్టాప్ గా శివ కుమార్ ప్రియాంకను ముద్దాడుతూనే ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావ్ అని ప్రియాంక శివ కుమార్ ని అడిగింది. నేను ఇలా ఉన్నా? నువ్వు ఎలా ఉన్నావ్ అని శివ కుమార్ అన్నాడు. నిన్ను చాలా మిస్ అయ్యానని ఆమె చెప్పగా, నేను కూడా అంటూ శివ కుమార్ అన్నాడు.
Bigg Boss Telugu 7
పెళ్లి ఎప్పుడని ప్రియాంక అడిగింది. నువ్వు బయటకు రాగానే చేసుకుందాం అన్నాడు. లేదు ఇప్పుడే చేసుకుందాం అన్నది. ఐదు నిమిషాల్లా సమయం గడిచిపోయిందని ప్రియాంక బాధపడింది. వారి వద్దకు వెళ్లిన శోభ... శివ కుమార్ ఈ రోజు ఉండే అవకాశం ఉందా అని బిగ్ బాస్ అని అడిగింది.
Bigg Boss Telugu 7
శివ కుమార్ నువ్వు ఇంటిని వీడే సమయం వచ్చిందని బిగ్ బాస్ చెప్పాడు. ప్రియాంకను వదిలి వెళ్లలేక వెళ్ళాడు శివ కుమార్. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు ప్రియాంక ఇటీవల శివ కుమార్ గురించి చెప్పింది. మొదట పేరు చెప్పని ప్రియాంక, తర్వాత శివ కుమార్ తన లవర్ అని ఓపెన్ అయ్యింది.
Bigg Boss Telugu 7
శివ కుమార్ కూడా సీరియల్ నటుడే. పలు పాప్యులర్ సీరియల్స్ అతడు మెయిన్ లీడ్ గా నటించాడు. వృత్తిపరంగా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసినట్లు సమాచారం. శివ కుమార్ రావడం వలన ప్రియాంక ప్లస్ కావచ్చు. అతని ఫ్యాన్స్ ప్రియాంకను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అతడు రావడానికి ఇది కూడా ఒక కారణం...