Bigg Boss Telugu 7: మాకున్న ఆస్తి ఎంతంటే, టైటిల్ గెలిస్తే ఆ డబ్బులతో... పల్లవి ప్రశాంత్ తండ్రి కీలక వ్యాఖ్యలు!
పల్లవి ప్రశాంత్ కి కోట్ల రూపాయల ఆస్తి ఉందంటూ వార్తలు ప్రచారం అవుతుండగా ఆయన పేరెంట్స్ స్పందించారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Bigg Boss Telugu 7
పల్లవి ప్రశాంత్ పేదవాడు కాదు, అతనికి కోట్ల ఆస్తి ఉందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం పల్లవి ప్రశాంత్ కి సొంత ఊరిలో దాదాపు 26 ఎకరాల పొలం ఉందట. అలాగే మంచి ఇల్లు, కారు కూడా ఉన్నాయట. అతడికి వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండటంతో ఆ పనులకు సంబంధించిన వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడట.
వారసత్వంగా పల్లవి ప్రశాంత్ కి ఆస్తులు ఉన్నాయి. అతడు మరీ పేదవాడు కాదు. అతని పొలం, ఇల్లు, కార్లు విలువ కలిపితే కోట్లలో ఉంటుందని ఓ వాదన తెరపైకి వచ్చింది. ఈ వార్తలపై పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందించాడు. మాకు కోట్ల ఆస్తులు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నాడు.
Bigg Boss Telugu 7
మాకు 26 ఎకరాల పొలం ఉంటే అది ఎక్కడో చూపించాలి. మాకు కేవలం 6 ఎకరాల పొలం ఉంది. అది పంచితే పల్లవి ప్రశాంత్ వాటా 2 ఎకరాలు వస్తుంది. మాకు కార్లు, బిల్డింగ్లు లేవు. అవన్నీ ఉంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి ఎందుకు వస్తాడు చెప్పండి. మేము పేదవాళ్ళమే అని ఆయన అన్నారు.
Bigg Boss Telugu 7
రైతుబిడ్డ అంటే అందరికీ చులకనే, తక్కువ భావనతో చూస్తారు. బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ ని మర్యాద లేకుండా మాట్లాడుతుంటే బాధేసింది. పల్లవి ప్రశాంత్ ఒకవేళ టైటిల్ గెలిస్తే ఆ డబ్బు రైతులకే ఇస్తాం. అంతకన్నా సంతోషం ఏమి ఉంటుంది. భూమిని నమ్ముకుని మా కళ్ళ ముందు ప్రాణాలు వదిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైతుల బాధ నాకు తెలుసు, అని పల్లవి ప్రశాంత్ తండ్రి అన్నారు.
Bigg Boss Telugu 7
కాగా పల్లవి ప్రశాంత్ కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టాడు. అతడికి ప్రేక్షకులు బాగా ఓట్లు వేస్తున్నారు. మొదటి రెండు వారాలు పల్లవి ప్రశాంత్ నామిషన్స్ లో ఉన్నాడు. అందరికంటే ఎక్కువ ఓట్లు అతనికి దక్కాయని సమాచారం.
పల్లవి ప్రశాంత్,