- Home
- Entertainment
- Bigg Boss Telugu 6: సిరి-శ్రీహాన్ లకు కొడుకు ఉన్నాడా? మమ్మీ డాడీ అనిపిస్తున్న ఆ పిల్లాడు ఎవరు?
Bigg Boss Telugu 6: సిరి-శ్రీహాన్ లకు కొడుకు ఉన్నాడా? మమ్మీ డాడీ అనిపిస్తున్న ఆ పిల్లాడు ఎవరు?
బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. లోపల ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వారిని కలవడానికి వచ్చారు. కాగా శ్రీహాన్ ని కలిసేందుకు ఆయన లవర్ సిరి వచ్చారు. అలాగే ఓ మూడేళ్ళ కుర్రాడు సిరితో పాటు శ్రీహాన్ కోసం వచ్చాడు. అతడు శ్రీహాన్ ని డాడీ, సిరిని అమ్మ అని పిలవడంతో వాళ్లకు కొడుకు ఉన్నాడా? అనే సందేహాలు మొదలయ్యాయి.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లి దాదాపు మూడు నెలలు అవుతుంది. దీంతో వారికి కుటుంబ సభ్యులు గుర్తుకు వస్తున్నారు. కంటెస్టెంట్స్ హోమ్ సిక్ పోగొట్టేందుకు బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ ఏర్పాటు చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తమ వారిని కలిసేందుకు కుటుంబ సభ్యులు రావడం జరిగింది.
Bigg Boss Telugu 6
కాగా శ్రీహాన్ కోసం తన లవర్ సిరి వచ్చారు. వీరిద్దరి రొమాన్స్ హైలెట్ అయ్యింది. సిరితో పాటు హౌస్లోకి శ్రీహాన్ కోసం ఒక మూడేళ్ళ బాలుడు రావడం జరిగింది. అతడు శ్రీహాన్ ని డాడీ అనిపిస్తున్నాడు. సిరిని మమ్మీ అంటున్నాడు. దాంతో జనాలకు ఆ అబ్బాయి ఎవరు? సిరి, శ్రీహాన్ లను అమ్మా నాన్నా అని పిలుస్తున్నాడేంటి? వాళ్ళ అబ్బాయేనా అతడు? అనే పలు సందేహాలు తెరపైకి వచ్చాయి.
ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కుర్రాడు సిరి మేనమామ కొడుకు. సిరి-శ్రీహాన్ ఆ బాలుడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. సిరి బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడు ఈ పిల్లాడి ప్రస్తావన వచ్చింది. తాను కనకపోయినా కొడుకు కంటే ఎక్కువని సిరి చెప్పింది.
Bigg Boss Telugu 6
సిరి వాళ్ళ అమ్మ శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో ఆ పిల్లాడు వివరాలు తెలిపారు. నా తమ్ముడు కుమారుడు అతడు. సిరి వద్దే పెరుగుతున్నాడని చెప్పడం జరిగింది. ఇక శ్రీహాన్ కూడా ఆ పిల్లాడికి దగ్గరైపోయాడు. దాంతో సిరిని మమ్మీ, శ్రీహాన్ ని డాడీ అనిపిస్తాడు. వారిద్దరినీ పేరెంట్స్ గా అతడు భావిస్తున్నాడు.
Bigg Boss Telugu 6
ఇక హౌస్లో ఆ పిల్లాడి ఎనర్జీకి కంటెస్టెంట్స్, ఆడియన్స్ ఫిదా అయ్యారు. రేవంత్, ఆదిరెడ్డి,శ్రీహాన్ లను అతడు ఇమిటేట్ చేశాడు. అందరూ వాడి అల్లరి ఎంజాయ్ చేశారు. ఇక శ్రీహాన్ తో సిరి అనేక విషయాలు మాట్లాడింది. అతడి పేరు వీపుపై పచ్చబొట్టు వేయించుకుంది. పనిలో పనిగా తన లవర్ తో సన్నిహితంగా ఉంటున్న శ్రీసత్యకు చురకలు వేసింది.