MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దుర్మార్గుల్లారా టీఆర్పీ కోసం పచ్చని జంటను విడిదీశారు కదరా... నామినేషన్స్ మంటలో భార్యాభర్తల మధ్య చిచ్చు 

దుర్మార్గుల్లారా టీఆర్పీ కోసం పచ్చని జంటను విడిదీశారు కదరా... నామినేషన్స్ మంటలో భార్యాభర్తల మధ్య చిచ్చు 

బిగ్ బాస్ సీజన్ 6 పరిస్థితి ఏం బాగోలేదు. షోలో పస లేకపోవడంతో ఆడియన్స్ చూడడం లేదు. కనీసం వీకెండ్ ఎపిసోడ్ కి కూడా మెరుగైన టీఆర్పీ దక్కడం లేదు. నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య చిచ్చుపెట్టారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 03 2022, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులు సీజన్ 6 ఎదుర్కొంటుంది. కనీసం ఓ సాధారణ సీరియల్ కి వచ్చే టీఆర్పీ కూడా బిగ్ బాస్ రియాలిటీ షోకి రావడం లేదు. హౌస్ మేట్స్ గేమ్, వాళ్లతో ఆడిస్తున్న టాస్క్స్ లో ఆసక్తి కలిగించడం లేదు. వారం మొత్తం రంజుగా నడిస్తేనే వీకెండ్ ఎపిసోడ్స్ పై ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ కారణంతో నాగార్జున కూడా ఏం చేయలేకపోతున్నాడు. టీఆర్పీ రాబట్టలేకపోతున్నామన్న అసహనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నాగార్జున కంటెస్టెంట్స్ ని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నాడు. ఆయన సహనాన్ని కోల్పోతున్నాడు. ఆదివారం ఎపిసోడ్ లో గీతూపై ఆయన ఆ రేంజ్ లో ఫైర్ కావడం అనూహ్య పరిణామం. పరిస్థితులు బాగుంటే, షోకి ఆశించిన టీఆర్పీ వస్తుంటే నాగార్జున పై ఒత్తిడి ఉండదు. టీఆర్పీ కత్తి ఆయన మెడపై వేలాడుతూ... నాగ్ లోని సహజ హోస్టింగ్ స్కిల్స్ ని దెబ్బతీస్తుంది. 
 

38
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఇక ఎలాగైనా టీఆర్పీ పెంచాలి, దానికి కంటెస్టెంట్స్ మధ్య మరింత కాంట్రవర్సీ క్రియేట్ చేయడమే మార్గంగా నిర్వాహకులు భావిస్తున్నారు. నేడు సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇకపై రోహిత్-మెరీనా వేరు వేరుగా కంటెస్టెంట్స్ గా గేమ్ ఆడాలని సూచించాడు. నామినేషన్స్ కోసం బిగ్ బాస్ సూచించిన ఇద్దరు కంటెస్టెంట్స్ గార్డెన్ ఏరియాలో ఉన్న సంకెళ్ళతో లాక్ అవ్వాలి. 
 

48
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


ఆ ఇద్దరిలో ఒకరు మరొకరిని కన్విన్స్ చేసి నామినేషన్స్ నుండి తప్పుకోవాలి. కన్విన్స్ అయిన కంటెస్టెంట్ నామినేట్ అవుతాడు. అవతలి కంటెస్టెంట్ ని ఒప్పించిన కంటెస్టెంట్ నామినేషన్ నుండి బయటపడతాడు. నాలుగు వారాల నుండి కపుల్ రోహిత్-మెరీనా జంటగా ఆడుతున్నారు. వారిద్దరిని ఒకే కంటెస్టెంట్ గా ట్రీట్ చేయడం జరిగింది. ఇకపై వారు ఎవరికీ వారే ఎవరి గేమ్ వారిదే. 
 

58
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

నామినేషన్స్లో వారిద్దరి పేర్లు బిగ్ బాస్ పిలిచాడు. దీంతో రోహిత్-మెరీనా హ్యాండ్ కప్స్ ధరించారు. మొగుడు పెళ్ళాలు కాబట్టి వారిద్దరి మధ్య ఫైట్ జరగలేదు. మెరీనా భర్త రోహిత్ హౌస్ లో ఉండాలని కోరుకుంది. కాబట్టి తాను నామినేటై రోహిత్ ని సేవ్ చేసింది.

68
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఆదిరెడ్డి-సింగర్ రేవంత్ పేర్లు పిలవడంతో వారిద్దరూ హ్యాండ్ కప్స్ వేసుకున్నారు. అయితే వీరిద్దరూ బద్ద శత్రువులు కాబట్టి ఎవరిని ఎవరు కన్విన్స్ చేశారనేది ఆసక్తికరం. అలాగే సుదీప-వాసంతి నామినేషన్ లో పోటీపడ్డారు. హౌస్ లో బాగా దగ్గరగా ఉంటున్న శ్రీసత్య-అర్జున్ కళ్యాణ్ మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టాడు. వారిద్దరి పేర్లు పిలవడంతో ఇద్దరిలో ఒకరు నామినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 

78
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

పోయినవారం టాస్క్ లో నీకు నా డబ్బులన్నీ ఇచ్చేశాను కాబట్టి నేను ఉంటా.. నువ్వు నామినేట్ అవమని అర్జున్ శ్రీసత్యను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. నువ్వు నాకు డబ్బులు ఊరకే ఇవ్వలేదు. సర్వీస్ చేయించుకొని ఇచ్చావు, కాబట్టి నేను ఉంటా నువ్వు నామినేట్ అవమని శ్రీసత్య అర్జున్ తో చెప్పింది. వీరి మధ్య చిన్న వాదన జరిగింది.

88
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

మరో నామినేషన్ లో భాగంగా బిగ్ బాస్ ఇనయ, శ్రీహాన్ పేర్లు పిలిచారు. వీరిద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. అయితే పౌరుషానికి పోయి ఇనయ నామినేట్ అయ్యింది. నామినేట్ అయినప్పటికీ నేను హౌస్ లో ఉంటా, టైటిల్ గెలుచుకునే పోతా అంటూ ఆమె శబధం చేశారు. ప్రస్తుతానికి మెరీనా, ఇనయ నామినేట్ అయినట్లు ప్రోమో ద్వారా అర్థం అవుతుంది. ఈవెనింగ్ పూర్తి ఎపిసోడ్ చూశాక ఈ వారం నామినేషన్స్ పై క్లారిటీ రాదు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved