- Home
- Entertainment
- Bigg Boss Telugu 6: చనిపోయే వరకు రుణపడి ఉంటా... కన్నీరు పెట్టిస్తున్న గీతూ ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్!
Bigg Boss Telugu 6: చనిపోయే వరకు రుణపడి ఉంటా... కన్నీరు పెట్టిస్తున్న గీతూ ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్!
ఎలిమినేటైన గీతూ ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నా ఆట కారణంగా బిగ్ బాస్ పై చిరాకు వస్తే క్షమించండి అంటూ ప్రేక్షకులను కోరుకుంది. గీతూ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.

Bigg Boss Telugu 6
బిగ్ బాస్ సీజన్ 6 నుండి టాప్ కంటెస్టెంట్ వైదొలిగింది.బిగ్ బాస్ షో అంటే ఏమాత్రం అవగాహన లేని తోటి కంటెస్టెంట్స్ కి గేమ్ ఎలా ఉంటుందో రుచి చూపించింది. డే వన్ నుండి గేమ్ ఆడిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది గీతూనే. ఆమె గేమ్ కి బిగ్ బాస్ ఫిదా అయ్యాడు. ప్రతి ఆటలో ఆమెను కీలకం చేశాడు. ఆమె చుట్టూ ఆట నడిపాడు.
Bigg Boss Telugu 6
ఈ పరిణామమే గీతూ గేమ్ ని దెబ్బతీసింది. ఆమెలో తనకే తెలియని ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇంకా బాగా ఆడాలనే తపనలో కొన్ని బేసిక్ వాల్యూస్ వదిలేసింది. దీంతో గీతూ ప్రణాళిక దెబ్బతింది. హౌస్లో తన ప్రవర్తన ఇతరుల్లో స్ఫూర్తి నింపాలని కోరుకున్న గీతూ... వరస్ట్ గేమ్ తో ఫేమ్ పోగొట్టుకున్నారు.
ఒక దశలో గీతూ గేమ్ బిగ్ బాస్ ని డామినేట్ చేసే స్థాయికి వెళ్ళింది. బిగ్ బాస్ ఆదేశాలు పక్కనపెట్టి తన రూల్స్ పెట్టడం మొదలుపెట్టింది. అలాగే హౌస్లో డీసెంట్, సాఫ్ట్ గా రోహిత్, మెరీనాలను టార్గెట్ చేసింది. బాల ఆదిత్య వీక్నెస్ తో ఆడుకొని అతన్ని ఏడిపించింది. ఇవన్నీ గీతూ ఆటలో భాగంగానే చేసింది. ఈ ప్రవర్తన ప్రేక్షకుల్లో విపరీతమైన వ్యతిరేకత తీసుకొచ్చింది.
Bigg Boss Telugu 6
అతి ప్రవర్తనతో టాప్ ఫైవ్ లో ఉండాల్సిన గీతూ 8వ వారమే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఆమె ఎలిమినేషన్ ఆడియన్స్ చేత కన్నీరు పెట్టించింది. గీతూ ఆవేదనలో ఆమెకు షో పట్ల ఉన్న ఇష్టం, డెడికేషన్ కనిపించాయి. అలాగే ఎన్ని ఆశలతో ఆమె బిగ్ బాస్ షోకి వచ్చిందో తెలిసింది. నేను పోను సార్ ఇక్కడే ఉంటా. నాకు వెళ్లాలని లేదంటూ గీతూ ఏడుస్తుంటే కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కన్నీరు పెట్టుకున్నారు.
అప్పటిదాకా గీతూను తిట్టుకున్నవారు, ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నవారు కూడా గీతూని మళ్ళీ హౌస్లోకి పంపిస్తే బాగుండు అనుకున్నారు. అంతలా గీతూ అందరినీ కదిలించింది. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్లో ఎమోషన్స్ కి తావు ఉండదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అందరి గుండెలు బరువెక్కగా గీతూ అధికారికంగా బిగ్ హౌస్ వీడింది.
Bigg Boss Telugu 6
బయటికొచ్చిన గీతూ మొదటి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తన సందేశంలో ప్రేక్షకుల పట్ల కృతజ్ఞత అలాగే తన ఆట పట్ల పశ్చాత్తాప భావం కనిపించాయి. జీవితంలో ఎన్నడూ చూడని అందమైన జీవితం బిగ్ బాస్ హౌస్లో అను అనుభవించాను. కానీ నేను అందులో ఓడిపోయాను. మనుషుల విలువ తీసింది. నన్ను నన్నుగా అర్థం చేసుకొని సప్పోర్ట్ చేసిన వాళ్లకు చనిపోయే వరకు రుణపడి ఉంటాను. బిగ్ బాస్ హౌస్లో నా ఆట ముగిసింది. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. నా వల్ల బిగ్ బాస్ మీద చిరాకు వచ్చిన వాళ్లకు కూడా పెద్ద సారీ... అని గీతూ పోస్ట్ చేశారు.
గీతూలో ఆట మధ్యలో ఎలిమినేట్ అయ్యాననే ఆవేదనతో పాటు పొరపాట్లు చేసిన ఆడియన్స్ కోపానికి కారణమయ్యాననే పశ్చాత్తాపం కనిపించాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్లో గీతూ జర్నీ ముగిసింది. అయినప్పటికీ ఆమె బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.