- Home
- Entertainment
- Bigg Boss Telugu 6: లీకైన మెరీనా రెమ్యూనరేషన్... ఊహించిన దానికంటే ఎక్కువే తీసుకెళ్లిందిగా!
Bigg Boss Telugu 6: లీకైన మెరీనా రెమ్యూనరేషన్... ఊహించిన దానికంటే ఎక్కువే తీసుకెళ్లిందిగా!
బిగ్ బాస్ సీజన్ 6 లో మరో ఎలిమినేషన్ జరిగింది. 11వ ఎలిమినేషన్ ద్వారా మెరీనా హౌస్ వీడారు. భార్యాభర్తలైన రోహిత్-మెరీనా జంటగా పాల్గొన్న నేపథ్యంలో ఒకరు బయటకు వచ్చేశారు.

Bigg Boss Telugu 6
బిగ్ బాస్ సీజన్ 6 మరో నాలుగు వారాల్లో ముగియనుంది. ఆదిరెడ్డి, రేవంత్, కీర్తి, ఇనయా,రోహిత్, మెరీనా, ఫైమా, శ్రీహాన్, శ్రీసత్య రాజ్ టాప్ టెన్ కంటెస్టెంట్స్ గా నిలిచారు. రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్ మీరే అంటూ నాగార్జున వాళ్లలో మరింత కసి రగిల్చారు.
Bigg Boss Telugu 6
11వ వారం కూడా హౌస్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ, ఎవిక్షన్ పాస్ కోసం కంటెస్టెంట్స్ చెమటోడ్చారు. రేవంత్ కెప్టెన్ గా అవతరించాడు. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో చివరి వరకు నిలిచి గెలిచిన రేవంత్ రెండోసారి కెప్టెన్ హోదా దక్కించుకున్నాడు.
Bigg Boss Telugu 6
అలాగే ఎవిక్షన్ పాస్ కోసం ఫైమా, రేవంత్, శ్రీహాన్ పోటీపడ్డారు. దీనిలో భాగంగా ముగ్గురు బరువులు మోయాల్సి ఉంది. రేవంత్, శ్రీహాన్ లకు ఎవిక్షన్ పాస్ అవసరం లేదని భావించిన ఇంటి సభ్యులు వారు భుజాన మోస్తున్న కర్రకు అధిక బరువులు జోడించారు. ఫైమాకు కేవలం రెండు వెయిట్స్ మాత్రమే వేశారు. దీంతో వీరిద్దరి కంటే అధిక సమయం బరువులు మోసి ఎవిక్షన్ పాస్ దక్కించుకుంది.
Bigg Boss Telugu 6
ఇక 11వ వారానికి నామినేషన్స్ లో 9 మంది ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లో గెలిచి రాజ్ ఇమ్యూనిటీ పొందాడు. దాంతో ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యాడు. దీంతో 8 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. ఆదిరెడ్డి, శ్రీహాన్ మొదట సేవ్ అయ్యారు. రేవంత్, కీర్తి, రోహిత్, శ్రీసత్య సేవ్ కావడం జరిగింది. ఇక ఇనయా, మెరీనా డేంజర్ జోన్లో మిగిలారు.
Bigg Boss Telugu 6
ఇనయా-మెరీనాలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఇనయా సేవ్ కావడంతో. మెరీనా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇనయా ఎలిమినేషన్ ని భర్త రోహిత్ తట్టుకోలేకపోయాడు. అతడు కన్నీరు పెట్టుకున్నారు. బిగ్ బాస్ రోహిత్-మెరీనాలను జంటగా ఆడేందుకు ఇంట్లోకి పంపారు. తర్వాత వేరు వేరు కంటెస్టెంట్స్ గా విభజించాడు.
Bigg Boss Telugu 6
కాగా 11 వారాలు హౌస్లో ఉన్న మెరీనా రెమ్యూనరేషన్ ఎంతనే విషయం లీకైంది. అందుతున్న సమాచారం ప్రకారం మెరీనా వారానికి రూ. 2.1 లక్షలు ఒప్పందంపై ఇంట్లోకి వెళ్లారట. ఆ లెక్కన ఆమె రూ. 23 లక్షలకు పైగా ఆర్జించారట. రోహిత్ ఫైనల్ కి వెళ్లడం ఖాయమని వినిపిస్తుండగా... ఇద్దరూ కలిసి పెద్ద మొత్తంలో అందుకున్నట్లే లెక్క.