MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 6: వాడు వెధవ మోసం చేశాడన్న ఇనయ... కన్నీరు పెట్టుకున్న రేవంత్!

Bigg Boss Telugu 6: వాడు వెధవ మోసం చేశాడన్న ఇనయ... కన్నీరు పెట్టుకున్న రేవంత్!

వాడు వీడు అనడమే కాకుండా వెధవ అంటూ రెచ్చిపోయింది ఇనయ సుల్తానా. పరిచయం లేని వాళ్ళను వాడు అనకూడదని నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె తీరు మారలేదు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 29 2022, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

నేటి ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇనయ సుల్తానా వాడు వీడు, వెధవ అంటూ రెచ్చిపోయింది. ఇక సింగర్ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. తనకు రాజ్ వంద రూపాయలు ఇవ్వలేదని గీతూ బాగా ఫీలైంది. 
 

28
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న గీతూ కంటెస్టెంట్ రాజ్ తనకు వంద రూపాయలు ఇవ్వలేదని ఫీల్ అయ్యింది. మనవాడు అంటుకుంటే నాకు ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇచ్చాడని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంలో రాజ్ పై కంటెస్టెంట్స్ మధ్య చర్చ నడిచింది. బెడ్ పై పడుకున్న గీతూతో పక్కనే ఉన్న ఫైమా ఇదే విషయాన్ని లేవనెత్తారు. రాజ్ మనవాడు అనుకుంటే మోసం చేశాడని మాట్లాడింది. అసలు నేను అనేదాన్ని ఒకరు ఉన్నారని కూడా గుర్తించుకోకుండా వంద రూపాయలు వేరే వాళ్లకు ఇచ్చాడు అందుకు నాకు బాధగా ఉందని చెప్పి గీతూ బాధపడింది.

38
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


గీతూ కి రాజ్ వంద రూపాయలు ఇవ్వకపోవడాన్ని ఇనయ కూడా ఖండించింది. ఇనయా ఈ విషయాన్ని మెరీనాతో చర్చించింది. ఆ అమ్మాయిని(గీతూ)ని చాలా మంది మోసం చేశారబ్బా. రాజు గాడు వెధవ, వాడు కూడా ఆమెను మోసం చేశాడని చెప్పింది. వాడు అనడం తప్పని నాగార్జున ఇనయాకు గతంలో చెప్పాడు. అయినప్పటికీ ఆమె కంటెస్టెంట్ రాజ్ ని వెధవ అని తిట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

48
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

 నిన్న నువ్వు డల్ అయినట్లు కనిపించిందని రేవంత్ తో శ్రీహాన్ చెప్పాడు. అనంతరం రేవంత్ కి బిగ్ బాస్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. బిగ్ బాస్ గిఫ్ట్ కి రేవంత్ ఎమోషనల్ కావడంతో పాటు ఆనందం వ్యక్తం చేశాడు. పోయిన వారం మీ ఆవిడ శ్రీమంతం జరిగింది. ఆ వీడియో ఇది అంటూ...రేవంత్ భార్య శ్రీమంతం వీడియో ప్లే చేసి చూపించాడు. 
 

58
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

భార్య గర్భవతి కాగా పక్కన లేనందుకు రేవంత్ ఫీల్ అయ్యాడు. శ్రీమంతం వీడియో చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి చిన్నపాటి వేడుక చేసుకున్నాడు. టీవీ స్క్రీన్ పై ఉన్న భార్య ఫోటోపై అక్షింతలు వేసి ఆశీర్వదించాడు.

68
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

తోటి కంటెస్టెంట్స్ రేవంత్ ని అభినందించారు. రేవంత్ హౌస్ లోకి వచ్చే సమయానికి భార్య గర్భవతన్న విషయం తెలిసిందే. లాంచింగ్ ఎపిసోడ్ లో రేవంత్ హౌస్లోకి వెళ్లబోయే ముందు భార్య కూడా వేదికపైకి వచ్చారు. భార్య కోసం మంచి సాంగ్ పాడి హౌస్లోకి రేవంత్ వెళ్ళాడు. 
 

78
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


ఇక బిగ్ బాస్ షో మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారానికి దగ్గరవుతుంది. ప్రస్తుతం హౌస్ లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వారిలో ఒకరు హౌస్ ని వీడనున్నారు. 

88
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 6 ప్రారంభమైంది. ఫస్ట్ వీక్ ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా అందరినీ సేవ్ చేశారు. సెకండ్ వీక్ అనూహ్యంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేశారు. షాని, అభినయశ్రీ ఎలిమినేట్ కావడం జరిగింది. గత వారం నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image3
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved