- Home
- Entertainment
- Bigg Boss Telugu 6: ముద్దు పెడితే కడుపు వస్తుందనుకున్నా... క్లాస్ మేట్ తో ఆరోహి రావు ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
Bigg Boss Telugu 6: ముద్దు పెడితే కడుపు వస్తుందనుకున్నా... క్లాస్ మేట్ తో ఆరోహి రావు ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఆరోహి రావ్ హౌస్ లో తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యింది. ఎంబీఏ చదివే రోజుల్లో ఒక అబ్బాయి ప్రేమలో పడ్డట్టు బయటపెట్టింది. ఆ అబ్బాయితో తన లవ్ జర్నీ ఎలా సాగిందో తెలియజేసింది.

కంటెస్టెంట్ ఆరోహి రావుది ఒడిదుడుకుల జీవితం. తల్లి అనారోగ్యంతో చనిపోతే తండ్రి పట్టించుకోకుండా వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. కష్టపడి చదువు పూర్తి చేసిన ఆరోహి రావు కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చారు. అంజలి పేరును ఆరోహి గా మార్చి, పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మార్చుకున్నారు. ఈ కష్టాల జీవితంలో ఆరోహికి ఓ ప్రేమ కథ కూడా ఉండదట.
ఎంబీఏ చదివే రోజుల్లో ఓ అబ్బాయిని ఇష్టపడినట్లు ఆమె వెల్లడించారు. షాని, పింకీ, నేహా చౌదరితో ఆరోహి రావ్ తన కాలేజ్ లవ్ స్టోరీ పంచుకుంది. ఆరోహి మాట్లాడుతూ... డిగ్రీ వరకు కూడా ఈ ప్రేమల గురించి తెలియదు. ముద్దు పెడితే కడుపు వచేస్తుందనుకునేంత అమాయకత్వం. అలాంటి నాకు ఎంబీఏ చదివే రోజుల్లో ఓ అబ్బాయి నచ్చాడు.
తను మంచి హైట్ , హ్యాండ్ సమ్ గా ఉండేవాడు. కాలేజీకి చాలా అరుదుగా వచ్చేవాడు. అయినా సార్స్ అడిగే ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పేవాడు. నాకు షాక్ అనిపించేది. అతడు పాలిటిక్స్ లో తిరుగుతూ ఉండేవాడు. అలాగే అప్పుడప్పుడు బ్లడ్ డొనేషన్స్ వంటి క్యాంప్స్ నిర్వహించేవాడు. అలా తనతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చాడు. నేను అలానే చూస్తూ ఉండిపోయాను.
ఇది ప్రేమా, ఆకర్షణా అని తెలుసుకోవాలి అనుకున్నాను. మూడు నెలలు ఇష్టం తగ్గకుండా అలానే ఉంటే ప్రేమ ,లేదంటే ఆకర్షణ అని తెలుసుకున్నాను. అదే టెస్ట్ నేను పెట్టుకున్నాను. కానీ నెల రోజులకే నాకు బోర్ కొట్టేశాడు. దాంతో మెల్లగా అతడికి దూరం అవుతూ వచ్చాను. నేను దూరం అవుతున్నప్పుడు అతడు నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. అతడు ఎంత దగ్గరవ్వాలి అనుకుంటే నాకు అంత నచ్చేవాడు కాదు.
మా జర్నీ మొదలైన నెల రోజులకు నేను కాలేజీ నుండి బయటికి వెళ్ళిపోయాను. తను కూడా నా జీవితం నుండి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ అతడు నాకు టచ్ లో ఉన్నాడు. అయితే తను కాకుండా బయట స్నేహితుడి కంటే ఎక్కువైన వ్యక్తి ఒకరు ఉన్నారు. టైటిల్ గెలిచినా గెలవక పోయినా గౌరవంగా ఆట ఆడిరా అని సూచించారని ఆరోహి చెప్పింది. అంటే కాలేజీలో అట్రాక్ట్ అయిన వ్యక్తి కాకుండా ఆరోహి జీవితంలో మరో వ్యక్తి ఉన్నాడని ఆమె పరోక్షంగా చెప్పింది.