MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10 Voting: ఐదో వారం ఓటింగ్‌.. టాప్‌లో రోహిత్‌, కానీ డేంజర్‌లో ముగ్గురు, ఇద్దరు ఔట్‌

Bigg Boss Telugu 10 Voting: ఐదో వారం ఓటింగ్‌.. టాప్‌లో రోహిత్‌, కానీ డేంజర్‌లో ముగ్గురు, ఇద్దరు ఔట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఐదో వారం ఓటింగ్‌ చూస్తే, ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఊహించని కంటెస్టెంట్లు డేంజర్‌లో ఉన్నారు. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందని అంటున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 09 2026, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10 5వ వారం ఓటింగ్‌
Image Credit : Asianet News

బిగ్‌ బాస్‌ తెలుగు 10 5వ వారం ఓటింగ్‌

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ పెరుగుతుండగా, బయట ఓటింగ్ ట్రెండ్స్ కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. అనధికారిక ఆన్‌లైన్ ఓటింగ్ పోల్ ప్రకారం రోహిత్ టాప్ లో కొనసాగుతుండగా, త్రిగుణ్ రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఝాన్సీ, వంశీ, వర్షిణి, షాలిని, చరణ్‌ వంటి కంటెస్టెంట్లు తక్కువ ఓట్లతో వెనుకంజలో కనిపిస్తున్నారు. ఐదో వారం ఓటింగ్‌ సరళి షాకిస్తోంది. ఎవరు ఎలిమినేట్‌ అవుతారో అనే ఉత్కంఠని క్రియేట్‌ చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రోహిత్‌ టాప్‌లో, ఝాన్సీ బాటమ్‌లో
Image Credit : Asianet News

రోహిత్‌ టాప్‌లో, ఝాన్సీ బాటమ్‌లో

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఐదో వారం ఓటింగ్‌లో రోహిత్‌, త్రిగుణ్‌లో టాప్‌లో దూసుకుపోతున్నారు. వీరితోపాటు ముఖేష్‌ గౌడ, రామ్ ప్రసాద్‌, నరేష్‌, అమన్‌ అపూర్వ వంటి వారు సేఫ్‌లోనే ఉన్నారు. కానీ ఈ సారి చరణ్‌, షాలిని, సింగర్‌ ఝాన్సీ మాత్రం డేంజర్‌లో ఉన్నారు. అయితే మరికొందరి లెక్కల ప్రకారం మాత్రం రామ్‌ ప్రసాద్‌, షాలిని, ముఖేష్‌, అపూర్వ, సింగర్‌ ఝాన్సీ డేంజర్‌లో ఉన్నారు. మెయిన్‌గా అయితే సింగర్‌ ఝాన్సీ, చరణ్‌, షాలిని, ముఖేష్‌ మధ్య ఎలిమినేషన్‌ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

34
సింగర్‌ ఝాన్సీ వద్ద పవర్‌
Image Credit : youtube@starmaa

సింగర్‌ ఝాన్సీ వద్ద పవర్‌

ఇదిలా ఉంటే సింగర్‌ ఝాన్సీ వద్ద పవర్‌ ఉంది. తాను ఎలిమినేషన్‌ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. సేవ్‌ అయ్యే పవర్‌ ఉంది. దాన్ని ఈ వారం ఉపయోగించాలని భావిస్తుంది. ఎలాగూ ఆమె బాటమ్‌లో ఉంది కాబట్టి తన పవర్‌ని ఉపయోగించి సేవ్‌ అయ్యే భావనలో ఉందట. ఆమె తన పవర్‌ని ఉపయోగించి సేవ్‌ అయితే మాత్రం ఎలిమినేషన్‌ వేరే వాళ్లు అయ్యే ఛాన్స్ ఉంది. మామూలుగా అయితే ఝాన్సీ ఎలిమినేషన్‌కి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఆమె కాదంటే షాలిని, చరణ్‌, ముఖేష్‌, రామ్‌ ప్రసాద్‌లో ఒకరుగానీ, ఇద్దరు కానీ ఎలిమినేట్‌ అవుతారని అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. అయితే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందా? సింగిలేనా అనేది తెలియాల్సి ఉంది.

44
ఐదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌
Image Credit : Star Maa

ఐదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌

ఇక ఈ వారంలోనే మినీ బిగ్‌ బాస్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. శివకుమార్‌, చైత్ర రాయ్‌, నీతూ నటరాజ్‌, నూకరాజు, రాకింగ్‌ రాకేష్‌ వంటి వారి పేర్లు బయటకు వచ్చాయి. అలాగే కావ్యశ్రీ పేరు కూడా చక్కర్లు కొడుతుంది. మరి ఎవరు వస్తారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది చూడాలి. కానీ ఈ వీకెండ్‌ మాత్రం చాలా స్పెషల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: డైరెక్టర్‌గా ఫ్లాప్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
Recommended image2
Singer Smita: వెంకటేష్ సినిమాలో నటించి తప్పు చేశా..బలవంతంగా ఆ పాత్ర చేయించారు, సింగర్ కామెంట్స్
Recommended image3
Hanuman Ansh Telugu Review: హనుమాన్‌ అంశ్‌ మూవీ రివ్యూ.. నీమ్‌ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image2
Hanuman Ansh Telugu Review: హనుమాన్‌ అంశ్‌ మూవీ రివ్యూ.. నీమ్‌ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved