- Home
- Entertainment
- Bigg Boss 10: తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన వంశీ..ఇక నీ ముఖం కూడా చూడను, షాలినిపై రోహిత్ ఫైర్
Bigg Boss 10: తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన వంశీ..ఇక నీ ముఖం కూడా చూడను, షాలినిపై రోహిత్ ఫైర్
బిగ్ బాస్ హౌస్ లో తొలిసారి టెంపర్ వంశీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అదే విధంగా రోహిత్, షాలిని మధ్య ఎమోషనల్ గా సంభాషణ జరిగింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా గురువారం రోజు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ అయ్యేంత వాగ్వాదం జరిగింది. టాస్క్ లో ఓడిపోవడంతో వంశీ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. గ్రీన్ టీం, వైల్డ్ ఫైర్స్ మధ్య జరిగిన టాస్క్ లో గ్రీన్ టీం విజయం సాధించింది ఆ వివారాలు ఇప్పుడు చూద్దాం.
వంశీ, శివకుమార్ మధ్య టాస్క్
ముందుగా శివకుమార్, వంశీ మధ్య టాస్క్ జరిగింది. ఈ టాస్క్ ని చాలా తెలివిగా అర్థం చేసుకుని ఆడాలి. ప్లేట్ ని, బౌల్ ని రెండింటిని టేబుల్ పై పెట్టి పట్టుకున్న వాళ్ళు విజేతలు. కానీ ప్లేట్ శివకుమార్ చేతుల్లో ఉంది .. బౌల్ వంశీ చేతుల్లో ఉంది. శివకుమార్ ముందుగా ప్లేట్ ని టేబుల్ పై పెట్టాడు. ఆ తర్వాత బౌల్ ని వంశీ పెట్టి వదిలేశారు. కానీ శివకుమార్ మాత్రం ప్లేట్, బౌల్ రెండింటిని పట్టుకున్నాడు.
ఓడిపోయిన వంశీ
తెలివిగా ఆడిన శివకుమార్ విజయం సాధించాడు. తాను సరిగ్గా ఆడలేకపోయాను అని వంశీ మనస్తాపానికి గురై తన చెంపలు తానే కొట్టుకున్నాడు. వెక్కి వెక్కి ఏడ్చేశాడు. త్రిగుణ్ అతడిని ఓదార్చారు. ఇంతలో రోహిత్, షాలిని మధ్య బ్రేకప్ జరిగేంత మాటలు మారాయి. షాలిని విషయంలో రోహిత్ కి కోపం వచ్చింది. నీతో నాకు మాట్లాడాలని కూడా లేదు. కనీసం సహనం లేని వ్యక్తి మన జీవితంలో ఉండడం వేస్ట్. ఎవరెవరో చెప్పింది విని అనలైజ్ చేయకుండా మైండ్ లోకి ఎక్కించుకుంటున్నావ్. నా ముఖం నీకు ఇక ఎప్పుడూ చూపించను అని రోహిత్ ఫైర్ అయ్యాడు.
వైల్డ్ ఫైర్స్ కి షాక్
ఆ తర్వాత గ్రీన్ టీంకి, వైల్డ్ ఫైర్ టీం కి టాస్క్ జరిగింది. గ్రీన్ టీం నుంచి అమన్, ముకేశ్.. వైల్డ్ ఫైర్ నుంచి ఆర్కే, దక్షి పాల్గొన్నారు. కానీ ఈ టాస్క్ లో గ్రీన్ టీం విజయం సాధించింది.

