MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్

Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆటో రామ్ ప్రసాద్ తొలిసారి కెప్టెన్ గా అవతరించారు. త్రిగుణ్ ఆడిన ఆటతో గేమ్ మొత్తం మారిపోయింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 16 2026, 11:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ తెలుగు 10
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ హౌస్ లో శుక్రవారం మంచి కిక్కిచ్చే పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్రిగుణ్ ఒక్క దెబ్బతో గేమ్ స్వరూపాన్నే మార్చేశారు. కానీ త్రిగుణ్ ఆడిన ఆట తన టీంకు ఏమాత్రం నచ్చలేదు. బ్లూ టీంలో ఉన్న త్రిగుణ్ ఆ టీమ్ కే వెన్నుపోటు పొడిచేలా ఆడారు. అది గ్రీన్ టీంకి అడ్వాంటేజ్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సొంత టీంకి త్రిగుణ్ వెన్నుపోటు
Image Credit : Asianet News

సొంత టీంకి త్రిగుణ్ వెన్నుపోటు

బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ లో బ్లూ టీం నుంచి త్రిగుణ్, గ్రీన్ టీమ్ నుంచి అమన్, గోల్డ్ టీం నుంచి శివకుమార్ పాల్గొన్నారు. కానీ త్రిగుణ్ తాను గెలవడానికి ప్రయత్నించకుండా గ్రీన్ టీంలోని అమన్ కి సపోర్ట్ చేశాడు. అంటే తన సొంత టీంకి వెన్నుపోటు పొడిచాడు. త్రిగుణ్ సపోర్ట్ తో అమన్ గేమ్ గెలిచాడు. దీనితో గ్రీన్ టీమ్ కి అత్యధిక పాయింట్స్ లభించాయి. బ్లూ టీంలో ఉన్న షాలిని, రోహిత్.. త్రిగుణ్ చేసిన పనికి షాక్ కావడమే కాదు.. త్రిగుణ్ బ్యాక్ స్టాబర్ అంటూ తిట్టిపోశారు.

34
రోహిత్ కెప్టెన్ కావడం ఇష్టం లేదు
Image Credit : Asianet News

రోహిత్ కెప్టెన్ కావడం ఇష్టం లేదు

షాలిని అయితే ఛీ, తూ అంటూ అసహనం వ్యక్తం చేసింది. వాళ్ళ ముందు త్రిగుణ్ ఏమీ మాట్లాడలేదు. గ్రీన్ టీం వద్దకు వెళ్లి తాను అమన్ కి ఎందుకు సపోర్ట్ చేశానో అనేది వివరించారు. నేను గేమ్ ఆడి గెలిస్తే నా టీంలోని రోహిత్ కి కెప్టెన్సీ టాస్క్ ఆడే అవకాశం వస్తుంది. రోహిత్ కెప్టెన్ కావడం కోసం నేను గేమ్ గెలవాలా ? నేనేమైనా పిచ్చోడినా అని తెలిపారు.

44
బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ గా రామ్ ప్రసాద్
Image Credit : Asianet News

బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ గా రామ్ ప్రసాద్

మొత్తంగా అత్యధిక పాయింట్స్ సాధించిన గ్రీన్ టీం సభ్యులకు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఛాన్స్ వచ్చింది. గ్రీన్ టీం కాకపోయినా శివ కుమార్ వద్ద అత్యధిక కాయిన్స్ ఉండడంతో అతడికి కూడా కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశం దక్కింది. ముకేశ్, వర్షిణి, వంశీ, శివకుమార్, రామ్ ప్రసాద్, అమన్, ఝాన్సీ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ ప్రకారం వీళ్లంతా ఒక గోడకు అమర్చిన మేకులపై నిలబడాలి. మిగిలిన సభ్యులు ఎవరు కెప్టెన్ కాకూడదు అని భావిస్తే వాళ్ళ మేకులు తొలగిస్తూ రావచ్చు. చివరికి ఎవరు గోడపై మిగిలితే వాళ్లే కెప్టెన్. ఈ టాస్క్ లో రామ్ ప్రసాద్ విజయం సాధించి బిగ్ బాస్ హౌస్ నయా కెప్టెన్ గా అవతరించాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ
Recommended image2
Yash: సంచలనం సృష్టిస్తున్న సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ సపోర్ట్.. ఫొటోలు చూసేయండి!
Recommended image3
OTT: సముద్రంలో దొరికిన బంగారు ఆభరణంతో ఊహించని చిక్కులు.. అదిరిపోయే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మిస్ కావొద్దు
Related Stories
Recommended image1
OTT: సముద్రంలో దొరికిన బంగారు ఆభరణంతో ఊహించని చిక్కులు.. అదిరిపోయే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మిస్ కావొద్దు
Recommended image2
Kota Srinivasa Rao: ఇష్టం లేకుంటే షూటింగ్ నుంచి వెళ్ళిపో, కోట శ్రీనివాసరావుతో డైరెక్టర్.. నటి వల్ల వివాదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved