- Home
- Entertainment
- Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
బిగ్ బాస్ హౌస్ లో శనివారం రోజు షాలినికి నాగార్జున ఒక రేంజ్ లో క్లాస్ పీకారు. ఆమె తప్పుల మీరు తప్పులు చేస్తూ ఏమాత్రం మారడం లేదని అన్నారు. నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్ తో షాలినికి మైండ్ బ్లాక్ అయింది.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ శనివారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో కొందరు హౌస్ మేట్స్ కి ఒక రేంజ్ లో క్లాస్ పీకారు. ముఖ్యంగా నాగార్జున పీకిన క్లాస్ కి షాలిని బిక్క ముఖం వేసుకుంది. ఆమె చేసిన తప్పులు నాగార్జున ఒక్కొక్కటిగా ఎత్తి చూపడం.. ఆమె క్షమాపణ కోరడం.. ఎపిసోడ్ మొత్తం ఇలాగే సాగింది.
నామినేషన్స్ గురించి చర్చ
ముందుగా నాగార్జున నీతూని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. వైల్డ్ ఫైర్ గా వచ్చిన వాళ్ళు ఇతర సభ్యులతో బయట విషయాలు చర్చించకూడదు అనే విషయం తెలియదా అంటూ నాగార్జున మండిపడ్డారు. నీతూ.. రోహిత్ తో తన ఫ్యామిలీ విషయాలు మాట్లాడింది. నాగార్జున మందలించడంతో ఆమె క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత నాగార్జున షాలినిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. నామినేషన్స్ గురించి అమన్, రోహిత్ లతో ఎందుకు చర్చించావు అని ప్రశించారు.
అమన్, షాలిని, రోహిత్ లకు బిగ్ షాక్
అలా చేయొద్దు అని ఆల్రెడీ చెప్పాను కదా.. అయినా మారలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్స్ గురించి చర్చ పెట్టిన అమన్, షాలిని, రోహిత్ లకు మైండ్ బ్లాక్ అయ్యే పనిష్మెంట్ నాగార్జున ఇచ్చారు. ఈ వారం వాళ్ళు ముగ్గురూ కెప్టెన్సీకంటెండర్స్ గా అవకాశం కోల్పోయారు అని నాగార్జున తెలిపారు. అంతటితో షాలిని పంచాయతీ ఆగలేదు. త్రిగుణ్ గేమ్ లో తన సొంత టీమ్ నే వెన్ను పోటు పొడిచాడు అంటూ షాలిని అసభ్యంగా తిట్టిన సంగతి తెలిసిందే.
త్రిగుణ్ పై అసభ్యంగా..
షాలిని మాట్లాడుతూ తాను తప్పుడు మాట మాట్లాడలేదు అని.. సౌండ్ మాత్రమే అలా వచ్చింది అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. అది తప్పు కాదా.. అయితే ఆ మాట ఏంటో ఇప్పుడు మాట్లాడు అని నాగార్జున అడిగారు. అప్పుడు షాలిని మళ్ళీ మాట మారుస్తూ.. అవును సర్ అది తప్పే.. కానీ నాకు ఛాన్స్ రాలేదు అనే కోపంతో అలా మాట్లాడాను అని ఒప్పుకుని క్షమాపణ కోరింది. ఈ వారం సుధీర్ కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు అని కూడా నాగార్జున తెలిపారు. అమన్, ముకేశ్ మధ్య గొడవలో అమన్ కూడా అసభ్యంగా మాట్లాడి అది నా స్లాంగ్ అంటూ సమర్ధించుకున్నారు. దీనితో నాగార్జున అమన్ కి కూడా క్లాస్ పీకారు. వైల్డ్ ఫైర్స్ గురించి ఆదివారం మాట్లాడతా అని నాగార్జున తెలిపారు.

