- Home
- Entertainment
- 3rd Week Elimination: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్, 15 లక్షలతో మిథిలేష్ జంప్.. లక్ అంటే వీళ్లదే
3rd Week Elimination: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్, 15 లక్షలతో మిథిలేష్ జంప్.. లక్ అంటే వీళ్లదే
బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వారం వంశీ ఎలిమినేట్ అవుతాడని భావించారు. కానీ అనూహ్యంగా మిథిలేష్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అతన్ని సేవ్ చేశాడట.

బిగ్ బాస్ 10 మూడో వారంలో ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభమై మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ మూడు వారాలు అనేక ట్విస్ట్ లు టర్న్ లతో సాగింది. మొదటి వారమే ఇద్దరిని హౌజ్ నుంచి పంపించేశారు బిగ్ బాస్. మిడ్ వీక్‌లోనే ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత చరణ్‌ని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. రెండో వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో ఇద్దరు కామనర్స్ ని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకొచ్చారు. అపూర్వ, మిథిలేష్ హౌజ్‌లోకి వచ్చారు. వచ్చి మూడే రోజులవుతుంది. ఈ వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. మిథిలేష్ అందరిని షాక్‌కి గురి చేశాడు.
ఓటింగ్‌లో బాటమ్‌లో ఉన్నది వాళ్లే
మూడో వారం ఎలిమినేషన్‌కి సంబంధించి చూస్తే, ఈ వారం త్రిగుణ్, సుధీర్ రెడ్డి, అమన్, చరణ్, వంశీ, షాలిని, వర్షిణి, సింగర్ ఝాన్సీ నామినేషన్స్ లో ఉన్నారు. ఓటింగ్ ప్రకారం త్రిగుణ్ టాప్‌లో ఉన్నారట. గత రెండు వారాలు బాటమ్‌లో ఉన్న సుధీర్ రెడ్డి ఈ సారి పుంజుకొని టాప్ 2లోకి వచ్చాడట. అలాగే అమన్, చరణ్, షాలినిలు కూడా టాప్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బాటమ్‌లో మాత్రం వంశీ, వర్షిణి, ఝాన్సీ ఉన్నట్టుగా అనధికారిక ఓటింగ్ ద్వారా తెలిసింది. అధికారిక ఓటింగ్ ప్రకారం వంశీ, వర్షిణి బాటమ్‌లో ఉన్నారట.
15లక్షలతో మిథిలేష్ జంప్
వీరిద్దరిలో ఒకరు మూడో వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఓటింగ్ ప్రకారం వంశీ ఎలిమినేట్ పక్కా అని అంతా భావించారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అదే ఫిక్స్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. నాగార్జున ప్రైజ్ మనీ ఆఫర్ చేశారు. ఐదు లక్షలు ఆఫర్ చేస్తే ఎవరూ రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత పది లక్షలు ఆఫర్ చేయగా దానికి ఎవరూ రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత 15 లక్షలు ఆఫర్ చేశారు నాగార్జున. దీనికి మిథిలేష్ టెంప్ట్ అయ్యాడట. ఆ మనీ తీసుకొని ఈ వారం హౌజ్ నుంచి బయటకు వచ్చేశాడట. దీంతో విన్నర్ ప్రైజ్ మనీలో 15 లక్షలు కోత పడింది. ఇప్పుడు రూ.35లక్షలే దక్కుతుందని నాగార్జున తెలిపారు.
మిథిలేష్ కారణంగా వంశీ, వర్షిణి సేఫ్
అయితే ఈ ప్రైజ్ మనీ ఆఫర్ అందరినీ షాక్‌కి గురి చేసింది. ఈ ట్విస్ట్ లు క్రేజీగా ఉన్నాయని బిగ్ బాస్ లవర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో వారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. ఎలిమినేషన్‌లో భాగంగానే మిథిలేష్ 15లక్షలతో హౌజ్‌ని వీడారని అంటున్నారు. ఇక ఎలిమినేషన్ లేదని చెబుతున్నారు. మరి ఇదే జరుగుతుందా? లేక చివరి నిమిషంలో ట్విస్ట్ ఇస్తారా అనేది చూడాలి. ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తే వర్షిణి, వంశీలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇప్పటికే మిథిలేష్ ఎలిమినేట్ కావడంతో ఈ వారం రెగ్యూలర్ ఎలిమినేషన్‌ని రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే మిథిలేష్ చేసిన పనికి వంశీ, వర్షిణి బతికిపోయారని చెప్పొచ్చు.

