MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అప్పుడే ఫైటింగ్ లు మొదలుపెట్టిన బిగ్ బాస్ ... *చ్చు లో పంచాయితీ మొదలయింది అంటున్న నెటిజన్లు.. !

అప్పుడే ఫైటింగ్ లు మొదలుపెట్టిన బిగ్ బాస్ ... *చ్చు లో పంచాయితీ మొదలయింది అంటున్న నెటిజన్లు.. !

బిగ్‌ బాస్‌ 6 ప్రారంభంతోనే బయట కాంట్రవర్సీలు షురూ అయ్యాయి. మరోవైపు హౌజ్‌లో కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్‌ బాస్‌. దీంతో నెటిజన్ల షాకింగ్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 05 2022, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్‌ బాస్‌(Bigg Boss Telugu 6) తెలుగు సీజన్‌ 6 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా ఈ షో ప్రారంభం కాగా, ఈ సారి అత్యధికంగా 21 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చారు. తొలి వారం తొలి రోజు నుంచే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో రచ్చ షురూ అయ్యింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా హౌజ్‌మేట్స్ మధ్య చిచ్చు పెట్టాడు బిగ్‌ బాస్‌. దీంతో అది రచ్చ లేపుతుండటం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గార్డెన్‌లో మార్నింగ్‌ కంటెస్టెంట్ల డాన్సులతో ప్రారంభమైన షో.. అనంతరం బాత్‌ రూమ్‌లో చిచ్చుకి తెరలేపింది. బాత్‌రూమ్‌లో వెంట్రుకలు పడ్డాయని ఆభ్యంతరం తెలిపింది గీతూ రాయల్‌(Geetu Royal). ఎవరి పని వాళ్లు చేయాలనే రూల్‌ పెట్టుకున్నా, వేరే వాళ్ల వెంట్రుకలు మాత్రం తాను తీయనని తెగేసి చెప్పింది గీతూ. అయితే ఆ వెంట్రుకలు సుల్తానే(Inaya Sultana) అంటూ మరో కంటెస్టెంట్‌ చెప్పడంతో గీతూ, సుల్తానా మధ్య బాత్‌ రూమ్‌ వెంట్రుకల ఇష్యూ చిచ్చు పెట్టింది. ఇద్దరు ఒకరిపై ఒకరు వాదోపవాదనలు దిగడం అందరిని షాక్‌కి గురి చేస్తుంది. 
 

36

ఈ క్రమంలో సుల్తానా సైతం వాదించే ప్రయత్నం నా హెయిరే ఉందని గ్యారేంటీ ఏంటీ అందరు స్నానం చేశారు, అందరివి కదా ఉండేది అని చెప్పగా, తిక్కా నీకు అంటూ గీతూ వెళ్లిపోవడం, నాకుండే తిక్క నాకుందిలే అంటూ సుల్తానా చెప్పడం హీటుని పెంచుతుంది. మొదటి రోజే గీతూ, సుల్తానాల మధ్య వివాదం రాజేశాడు బిగ్‌బాస్‌. ఇది చూసి మిగిలిన వారంతా సైలెంట్‌ అయిపోవడం విశేషం.

46

దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో పంచాయితీ మొదలయ్యిందని రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అప్పుడు బిగ్‌ బాస్‌ ఫైటింగ్‌లు స్టార్ట్ చేశారని, ఈ రొచ్చు ఇక ఆగదంటూ సెటైర్లు పేలుస్తున్నారు ఇంటర్నెట్‌ ఆడియెన్స్. వారి మధ్య వెంట్రుకల గొడవలను హైలైట్‌ చేస్తూ రచ్చ లేపుతున్నారు. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అవుతుంది.
 

56

ఇంకా బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మొదటి టాస్క్ పెట్టాడు బిగ్‌ బాస్‌. ఆ టాస్క్ ని ఫైమా(Fiama) చదివి వినిపించింది. ఇందులో హౌజ్‌లోని సభ్యులను క్లాస్‌, ట్రాష్‌ అంటూ మూడు భాగాలుగా విభజించారు. ఎవరు క్లాస్‌, ఎవరు ట్రాష్‌ అనేది వాళ్లే తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మరోసారి కంటెస్టెంట్ల మధ్య చిట్టు రాజేసిందని చెప్పొచ్చు. 

66

క్లాస్‌ సెక్షన్‌ వాళ్లు సకల సౌకర్యాలు అనుభవిస్తారని, ట్రాష్‌ వాళ్లు బయట గార్డెన్‌ ఏరియాలో వంట చేసుకుని తినాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మరోసారి హౌజ్‌ హీటెక్కిందని చెప్పొచ్చు. ఇక వీళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నేరుగా నామినేట్‌ అవుతారని ఫైమా చెప్పడంతో అంతా నోరెళ్లబెట్టారు. మొత్తంగా బిగ్‌ బాస్‌ 6 హౌజ్‌లో తొలి రోజే ఆట హీటెక్కించిందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: కోమా నుంచి బయటపడడమే గొప్ప అయితే బోనస్ గా హీరోకి ఆ శక్తి..ఓటీటీలోకి మలయాళీ థ్రిల్లర్, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Sara Ali Khan Home: తండ్రి 5000 కోట్ల ఆస్తికి అధిపతి.. రూ.18 కోట్ల హౌస్ లో ఉంటున్న కూతురు
Recommended image3
Naga Chaitanya: నాగార్జున మొదటి భార్య ఇప్పుడేం చేస్తోంది? నాగ చైతన్య తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved