MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: కోమా నుంచి బయటపడడమే గొప్ప అయితే బోనస్ గా హీరోకి ఆ శక్తి..ఓటీటీలోకి మలయాళీ థ్రిల్లర్, ఎప్పటి నుంచి అంటే

OTT: కోమా నుంచి బయటపడడమే గొప్ప అయితే బోనస్ గా హీరోకి ఆ శక్తి..ఓటీటీలోకి మలయాళీ థ్రిల్లర్, ఎప్పటి నుంచి అంటే

సంగీత్ ప్రతాప్ నటించిన మలయాళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్’ అక్టోబర్ 15 నుంచి మనోరమ మ్యాక్స్‌లో తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 10 2026, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Its A Medical Miracle
Image Credit : Asianet News

Its A Medical Miracle

ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మరో కొత్త చిత్రం అందుబాటులోకి రానుంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్’ డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. సాధారణ కథలకు భిన్నంగా అతీంద్రియ అంశాలను మేళవించి రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అక్టోబర్ 15 నుంచి ఓటీటీలోకి
Image Credit : X

అక్టోబర్ 15 నుంచి ఓటీటీలోకి

సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్, అఖిల భార్గవన్ నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 15 నుంచి మనోరమ మ్యాక్స్‌లో ఈ సినిమాను చూడవచ్చు. మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో చూడాలనుకునే వారికి కూడా అవకాశం లభించనుంది.

34
ప్రాణాలతో తిరిగొచ్చిన యువకుడి కథ
Image Credit : X

ప్రాణాలతో తిరిగొచ్చిన యువకుడి కథ

ఈ సినిమాలో కథానాయకుడి జీవితమే ఓ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడు తిరిగి ప్రాణాలతో బయటపడటంతో కథ మొదలవుతుంది. అయితే అతడు కోమా నుంచి కోలుకున్న తర్వాత తనలో వచ్చిన మార్పును గుర్తిస్తాడు. చుట్టూ ఉన్నవారికి సాధారణంగా వినిపించే శబ్దాలు కూడా అతడికి అత్యంత తీవ్రంగా వినిపిస్తుంటాయి. ఈ వింత సామర్థ్యం అతడికి వరంగా మారుతుందా? సమస్యలు తెచ్చిపెడుతుందా? అనే ఆసక్తిని కథ ముందుకు తీసుకెళ్తుంది.

44
రహస్యాల మధ్య సాగనున్న ప్రయాణం
Image Credit : Asianet News

రహస్యాల మధ్య సాగనున్న ప్రయాణం

తనను ప్రాణాపాయం నుంచి కాపాడిన నర్సు ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నం కథానాయకుడిని మరో ప్రమాదకరమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆమె గొంతును వెతికే క్రమంలో ఓ రహస్యమైన ఆటలో భాగమవుతాడు. అక్కడ అతడికి ఎదురయ్యే శత్రువులు, అనూహ్య పరిణామాలు పరిస్థితులను మరింత క్లిష్టంగా మారుస్తాయి. ఈ చిక్కుల నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? తనను కాపాడిన నర్సును కనుగొన్నాడా? అనే ప్రశ్నలకు సినిమాలో సమాధానం లభిస్తుంది. ఈ నెల 15 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రంలో సంగీత్ ప్రతాప్ నటనతో పాటు కథలోని మలుపులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sara Ali Khan Home: తండ్రి 5000 కోట్ల ఆస్తికి అధిపతి.. రూ.18 కోట్ల హౌస్ లో ఉంటున్న కూతురు
Recommended image2
Naga Chaitanya: నాగార్జున మొదటి భార్య ఇప్పుడేం చేస్తోంది? నాగ చైతన్య తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా?
Recommended image3
Poonam Kaur: త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ డైరెక్ట్ అటాక్.. మా ఫ్యామిలీ బలహీనతని వాడుకున్నాడు, సంచలన ఆరోపణలు
Related Stories
Recommended image1
Krishna: ఆ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా భయపడిన కృష్ణ..18 పేజీల క్లైమాక్స్ తో దద్దరిల్లిన థియేటర్స్
Recommended image2
Annayya Movie: చిరంజీవికి చెప్పి హీరోయిన్లని మార్చుకున్న యంగ్ హీరోలు..బాబోయ్ వాళ్ళు మాకు వద్దు అంటూ కంప్లైంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved