- Home
- Entertainment
- ఎవరూ గుర్తు పట్టకుండా మీసాలు తీసేసినా దుబాయ్ లో దొరికిపోయిన శివాజీ.. మళ్ళీ కెలికాడుగా..
ఎవరూ గుర్తు పట్టకుండా మీసాలు తీసేసినా దుబాయ్ లో దొరికిపోయిన శివాజీ.. మళ్ళీ కెలికాడుగా..
బిగ్ బాస్ ముగిసిన తర్వాత హీరో శివాజీకి ఊహించని పబ్లిసిటీ లభించింది. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడం వెనుక కారణం శివాజీనే అంటూ కూడా ప్రశంసలు దక్కాయి.

బిగ్ బాస్ ముగిసిన తర్వాత హీరో శివాజీకి ఊహించని పబ్లిసిటీ లభించింది. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడం వెనుక కారణం శివాజీనే అంటూ కూడా ప్రశంసలు దక్కాయి. శివాజీ ఇప్పటికి వరుసగా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాను నటించిన 90's మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ ని కూడా రిలీజ్ చేశారు.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తర్వాత శివాజీ జాతకమే మారిపోయినట్లు ఉంది. 90's మిడిల్ క్లాస్ బయోపిక్ ఓటిటిలో సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన మీమ్స్ దర్శనం ఇస్తున్నాయి. దీనితో శివాజీ ముందుండి ఈ వెబ్ సిరీస్ ని మరింతగా ప్రమోట్ చేస్తున్నారు.
Sivaji
బిగ్ బాస్ షోతో శివాజీ శివన్నగా మారిపోయాడు. తాజాగా శివాజీ అలీతో సరదాగా షోకి హాజరయ్యాడు. అలీ తన స్టైల్ లో సరదాగా మాట్లాడుతూనే శివాజీకి పాత విషయాల్ని గుర్తు చేశాడు. నటనకి దూరంగా ఉన్నావు కదా.. 90 స్ బయోపిక్ లో ఛాన్స్ ఎలా వచ్చింది అని అలీ ప్రశ్నించాడు. దీనికి శివాజీ సరదాగా సమాధానం ఇచ్చాడు. నీకు పిల్లలు ఎంత మంది అని అడుగగా ఇద్దరు కొడుకులు అని శివాజీ బదులిచ్చాడు.
కూతురు కూడా ఉన్నట్లు చెబుతున్నారు ఏంటి అని అడిగాడు. ఆ కూతురు ఎక్కడ ఉందో తెచ్చిపెట్టండి బంగారంలా చూసుకుంటాను అని నవ్వుతూ తెలిపాడు. మా నాన్న మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడుతుండేవాడు. వ్యవసారంలో ఏమీ మిగిలేది కాదు. అందుకే బాధ్యతలు నేను కూడా పంచుకోలేని హైదరాబాద్ వచ్చేశా.
పేదరికంలో అనుభవించిన కష్ఠాలని గుర్తు చేసుకుని శివాజీ ఎమోషనల్ అయ్యారు. కనీసం చెప్పులు కొనివ్వడానికి కూడా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు అని శివాజీ తెలిపారు. శివాజీ కెరీర్ లో ఒక వివాదాస్పద అంశాన్ని అలీ ఈ షోలో కెలికారు. నిన్ను ఎవరూ గుర్తు పట్టకూడదు ని మీసాలు తీసేసి తిరిగావు ఎందుకు అని అలీ ప్రశ్నించారు. పాత కాంట్రవర్సీకి అలీ మరోసారి కెలికాడు.
Sivaji
శివాజీ సమాధానం ఇస్తూ వేషం మార్చి దుబాయ్ లో దొరికిపోయిన శివాజీ అంటూ వార్తల్లో నా గురించి వేశారు అని శివాజీ బాధపడ్డారు. అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే 2019లో అలంద మీడియా వివాదం చెలరేగింది. అందులో శివాజీ పేరు కూడా వచ్చింది. దీనితో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనితో దేశం విడిచి వెళ్ళకూడదు. కానీ శివాజీ మీసాలు తీసేసి అమెరికా వెళుతూ దుబాయ్ లో పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి శివాజీ ఖండించారు. తాను 50 కంటే ఎక్కువసార్లు అమెరికా వెళ్లి వచ్చానని.. ప్రతిసారి లీగల్ గానే వెళ్లానని శివాజీ తెలిపారు.