'జవాన్' లో మెరిసిన తెలుగు బ్యూటీ, బిగ్ సర్ప్రైజ్.. షారుఖ్ పక్కన సిరి హనుమంత్
బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తాజాగా సిరి తెలుగు ఆడియన్స్ కి మామూలు సర్ప్రైజ్ ఇవ్వలేదు.
బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది.
చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది. దీనితో సిరిని కార్నర్ చేస్తూ చాలా ట్రోలింగ్ జరిగింది. కానీ ట్రోలింగ్ పట్టించుకోకుండా సిరి తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది.
బుల్లితెర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. యాంకరింగ్ కూడా చేసింది. అయితే తాజాగా సిరి తెలుగు ఆడియన్స్ కి మామూలు సర్ప్రైజ్ ఇవ్వలేదు. ఏకంగా జవాన్ చిత్రంలో షారుఖ్ పక్కన నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది. జవాన్ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలయింది.
ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి స్టన్నింగ్ రెస్పాన్స్ వస్తోంది. నయనతార హీరోయిన్ గా నటించగా.. దీపికా పదుకొనె కీలక పాత్రలో మెరిసింది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ తో జవాన్ చిత్రం సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నుంచి ఎవరూ లేరే అనే లోటుని ఈ క్రేజీ బ్యూటీ తీర్చేసింది. అయితే సిరి పాత్రకు ఎలాంటి డైలాగులు లేవు. కానీ షారుఖ్ పక్కనే నటించడం మామూలు విషయం కాదు.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో షారుఖ్ నటించగా ఆయనకి సబ్ ఆర్డినేట్ పాత్రలో సిరి మెరిసింది. దీనితో జవాన్ చిత్రంలో సిరిని చూస్తున్న ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ కి గురవుతున్నారు. ఆమె దృశ్యాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సిరి పలు చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. కానీ ఆ చిత్రాలేవీ సిరికి గుర్తింపు తీసుకురాలేదు. జవాన్ చిత్రంతో సిరి ట్రెండ్ కావడం ఖాయం. అప్పుడే ఫ్యాన్స్ ఆమెకి విషెష్ చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు.