- Home
- Entertainment
- బిగ్ బాస్ చేసిన డ్యామేజ్... గోల్డెన్ ఆఫర్ కోల్పోయిన శోభ శెట్టి, విలన్ గా చూస్తున్నారంటూ ఆవేదన!
బిగ్ బాస్ చేసిన డ్యామేజ్... గోల్డెన్ ఆఫర్ కోల్పోయిన శోభ శెట్టి, విలన్ గా చూస్తున్నారంటూ ఆవేదన!
శోభ శెట్టికి బిగ్ బాస్ షో వలన మంచి కంటే చెడే ఎక్కువ జరిగినట్లు అనిపిస్తుంది. సదరు షోలో నెగిటివ్ ఇమేజ్ సొంతం చేసుకున్న శోభ గోల్డెన్ ఆఫర్ మిస్ అయినట్లు స్వయంగా తెలిపింది.

Shobha Shetty
బిగ్ బాస్ రియాలిటీ షో శోభ శెట్టి ఇమేజ్ బాగా డామేజ్ చేసినట్లు ఉంది. ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. అంతెందుకు ఆమెకు ఏంటో పేరు తెచ్చిపెట్టిన కార్తీక దీపం సీరియల్ సీక్వెల్ లో కూడా ఆమెకు ఛాన్స్ దక్కలేదు. ఈ విషయాన్ని శోభ శెట్టి స్వయంగా వెల్లడించింది.
Shobha shetty
బిగ్ బాస్ సీజన్ 7లో శోభ శెట్టి పాల్గొన్న విషయం తెలిసిందే. శోభ శెట్టి ప్రవర్తన హౌస్లో వివాదాస్పదం అయ్యింది. తలబిరుసు సమాధానాలు, ఇతర కంటెస్టెంట్స్ ని చులకనగా చూడటం జనాలకు నచ్చలేదు. ఒక దశలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెను ఎలిమినేట్ చేయాలనే డిమాండ్ వినిపించింది.
serial actress Shobha shetty
శోభ శెట్టి ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. స్టార్ మా యాజమాన్యం ఆమెను కాపాడుతూ వచ్చిందనే విమర్శలు వినిపించాయి. శోభ శెట్టి ఫైనల్ కి ముందు 14వ వారం ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చిన శోభ శెట్టిని జనాలు ట్రోల్ చేశారు. ఆమెపై షో ఎంత నెగిటివిటీ తెచ్చిపెట్టిందో ఆమె స్వయంగా తెలుసుకుంది.
serial actress Shobha shetty
దాంతో పలుమార్లు క్షమాపణలు చెప్పింది. నేను హౌస్లో ఏం చేసినా గేమ్ లో భాగమే. కావాలని ఏం చేయలేదు. నేను ఏదైనా తప్పుగా చేసి ఉంటే క్షమించండి అంటూ వీడియోలు విడుదల చేసింది. కానీ శోభ బిగ్ బాస్ షో కారణంగా ఉన్న ఇమేజ్ కూడా పోగొట్టుకుంది. దానికి తాజా పరిణామం ఉదాహరణ.
serial actress Shobha shetty
కార్తీక దీపం 2 లో శోభ శెట్టికి ఛాన్స్ దక్కలేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. కార్తీక దీపం 2లో నాకు ఆఫర్ దక్కలేదు. బిగ్ బాస్ హౌస్లో నన్ను విలన్ గా చూశారు. కార్తీక దీపం లో నన్ను మోనితగా ఎలా చూశారో హౌస్లో కూడా అలానే చూశారు.
serial actress Shobha shetty
ఇక కార్తీక దీపం 2 ప్రోమో చాలా బాగుంది. అయితే ఈ సీరియల్ లో నేను నటించడం లేదు. నటించాలని ఎవరూ సంప్రదించలేదు. కాబట్టి కార్తీక దీపం 2లో నాకు ఛాన్స్ దక్కలేదని శోభ శెట్టి అన్నారు. ఆమె పరోక్షంగా బిగ్ బాస్ షో తన ఇమేజ్ ని దెబ్బ తీసిందని. అందుకే ఆఫర్ దక్కలేదనే అర్థంలో మాట్లాడింది.
serial actress Shobha shetty
కాగా శోభ ఈ మధ్య వ్యాపారాల మీద దృష్టి పెట్టింది. ఆమె మేకప్ స్టూడియో పెట్టింది. అలాగే చీరల వ్యాపారం చేయాలి అనుకుంటుంది. కాఫీ విత్ శోభ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తోంది. కార్తీక దీపం 2 త్వరలో ప్రారంభం కానుంది. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు చేసిన నిరుపమ్, పేమి విశ్వనాథ్ తిరిగి నటిస్తున్నారు.