MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమ్మతనం కోసం సుదీప, నాన్న ప్రేమకావాలంటూ.. రేవంత్, హౌస్ లో అందరిని ఏడిపించేసిన కీర్తి

అమ్మతనం కోసం సుదీప, నాన్న ప్రేమకావాలంటూ.. రేవంత్, హౌస్ లో అందరిని ఏడిపించేసిన కీర్తి

బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. కాస్త చేంజ్  చేసి హౌస్ మెంట్స్ తో ఆటఆడుకుంటున్నాడు బిగ్ బాస్. ఇక ఈసారి ఎపిసోడ్ లో ఎమోషనల్  స్టోరీస్ తో అందరిని ఏడిపంచేశారు. ఒక్కొక్కరు వారి గతాలను 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 15 2022, 10:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ పదకొండోవ రోజు..బిగ్ బాస్ ఇంట్లో ఏడుపులతో ఎమోషనల్ గా తయారయ్యింది. ఎవరికి వారు ఎమోషన్ల్ మూమెంట్స్ ను శేర్ చేసుకున్నారు. ముఖ్యంగా సుధీప, కీర్తి, రేవంత్ లు చెప్పిన మాటలకు హౌస్ మెంబర్స్ అంతా కంటతడి పెట్టకుండా ఉండలేక పోయారు. 

27

ముందుగా మాట్లాడిన సుధీప తన జీవితంలో జరిగిన  సాడ్ సిచ్చ్యూవేషన్ ను తలుచుకుని ఏమోషనల్ అయ్యింది. తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు థైరాయిడ్క ప్రాబ్లమ్ వల్ల బేబీని కోల్పోయినట్టు చెప్పింది. అంతా మంచే జరుగుతుంది అనుకుంటున్న టైమ్ లో ఈ సంఘటన తన జీవితాన్నే మార్చేసిందంటూ బాధపడింది సుధీప. 

37

ఇక కీర్తి మాట్లాడుతూ.. తన జీవితంలో భయంకరమైన సంఘటనలు గురించి వివరించింది. దేవాలయానికి వెళ్లి వస్తూ.. తన కుంటుంబం అంతా కారు యాక్సిడెంట్ లో మరణించారని. ఫ్యామిలీ మొత్తం మీద తాను ఒక్కతినే బ్రతికి ఉన్నానని. ఎందుకు బ్రతికానురా దేవుడా అనుకున్నానంటూ ఏడ్చేసి.. హౌస్ అందరిని ఏడిపించేసింది కీర్తి. బంధువులు కూడా తన ఆస్తిని తీసుకుని తనను రోడ్డు మీద వదిలేశారంటూ బాధపడింది కీర్తి. 

47

అంతే కాదు చేతిలో చిల్లి గవ్వ లేకుండా బయటకు వచ్చిన తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్టేజ్ కు వచ్చానని చెప్పింది కీర్తి. అందరిని పోగొట్టుకున్న తన జీవితంలో.. సంతోషాన్ని నింపింది తన దత్తత కూతురు అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. ఇక తాను బిగ్ బాస్ హౌస్ కు వచ్చే ముందు ఆ బిడ్డను కూడా కోల్పోయానని.. తన ఆరోగ్యం బాగోలేక తన బిడ్డ మరణించిందని. తను పెళ్ళిచేసుకున్నా పిల్లల్ని కనలేనని. యాక్సిడెంట్ లో తన గర్బసంచి తీసేశారంటూ.. కీర్తి చెపుతుంటే.. హౌస్ అంతా ఎమోషనల్ అయ్యారు. 

57

ఇక సింగర్ రేవంత్ కూడా ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో నాన్న ప్రేమను పొందలేకపోయానని చెపుతూ.. ఒక్క సారి నాన్నా అని పిలవాలని బాధపడ్డారు. తను త్వరలో తండ్రి కాబోతున్నానంటూ.. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళేలోపు తనను నాన్నా అని పిలిచే బిడ్డ రెడీగా ఉంటుందంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. నాన్నా అని పిలవలేక పోయినా.. నాన్నా అని పిలిపించుకోబోతున్నానంటూ అన్నారు రేవంత్. 

67

ఇక హౌస్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా  ఉన్న మెరీనా జంట కూడా ఎమోషనల్ స్టోరీ చెప్పారు. మెరీనా మాట్లాడుతూ.. తనకు తండ్రి ప్రేమ అంటే తెలియదని. ఆయన ఎవరో కూడా తెలియదన్నారు. ఒక రోజు ఒక అతను వచ్చి నేను మీ నాన్నను అన్నారు. ఆయన తన తల్లిని కొట్టడం చూసి.. తండ్రీ అంటేనే అసహ్యం పుట్టిందంటూ ఎమోషనల్ అయ్యింది. ఎవరైనా తన తండ్రి ఏడి అంటే చనిపనోయాడని చెపుతానంది. కాని తనకు మిస్ అయిన తండ్రి ప్రేమ కూడా తన భర్త అందిస్తున్నాడంటూ చెప్పుకోచ్చింది. 
 

77

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆతరువాత క్యాప్టెన్సి టాస్క్ లో బాగంగా మ్యూజిక్ గేమ్ ఆడిచాడు బిగ్ బాస్. అందులో రాజశేఖర్, సుల్తాన, చంటీ, సూర్యల లో ఎవరికి ఓటు వేస్తారో జంటగా చెప్పాలంటూ.. మ్యూజిక్ గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఇక అది ఈరోజు అసంపూర్ణం కావడంతో.. రేపటి ఎపిసోడ్ లో హౌస్ కు కొత్త కెప్టెన్ ఎవరు అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved