- Home
- Entertainment
- బిగ్ బాస్ సీజన్ 5: షణ్ముఖ్ కన్నింగ్ గేమ్, నెటిజెన్స్ ట్రోలింగ్.. సిరిని అడ్డం పెట్టుకొని!
బిగ్ బాస్ సీజన్ 5: షణ్ముఖ్ కన్నింగ్ గేమ్, నెటిజెన్స్ ట్రోలింగ్.. సిరిని అడ్డం పెట్టుకొని!
బిగ్ బాస్ సీజన్ 5 మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌస్ లో కంటెస్టెంట్స్ పై ప్రేక్షకులు ఓ అభిప్రాయానికి వచ్చారు. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్లో సాఫ్ట్, ఫెయిర్ కంటెస్టెంట్స్ తక్కువగానే ఉన్నట్లు ఉన్నారు.

చిన్న చిన్న విషయాలకు గొడపడుతున్న కంటెస్టెంట్స్, టాస్క్ విషయంలో కూడా అసలు తగ్గడం లేదు. చాలా వైల్డ్ అండ్ అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఉన్నవారిలో మానస్, షణ్ముఖ్ కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తున్నారు.
అయితే షణ్ముఖ్ గేమ్ ప్లాన్ ఎవరికీ అర్థం కావడం లేదు. మనోడు వెళ్లడంతోనే తన ఫ్రెండ్ సిరి హన్మంత్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. అదే సమయంలో ఆమె కూడా షణ్ముఖ్ ని వదలడం లేదు. డీప్ లవర్స్ మాదిరి వీళ్ల వ్యవహారం సాగుతుంది. అప్పుడప్పుడు ఇద్దరూ గొడవపడుతూ తమ మధ్య ఏదో నడుస్తోందన్న భావన కలిగిస్తున్నారు.
గత సీజన్స్ లో లవ్ బర్డ్స్ ప్రచారమైన రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్-మోనాల్ లకు హౌస్ లో ఎక్కువ కాలం ఉండే ఛాన్స్ దక్కింది. ప్రేక్షకులు దీని పట్ల ఇంటరెస్ట్ గా ఉన్నారని, ఓట్లతో సంబంధం లేకుండా వారిని హౌస్ లో ఉంచారనే, రూమర్ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో షణ్ముఖ్, సిరి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది. హౌస్లో వీళ్ళిద్దరూ సపరేట్ గా కనిపిస్తారు. పేరుకు మాత్రం ఫ్రెండ్స్ అంటూ, పక్క పక్కనే బెడ్స్, ఒకరి ఒడిలో ఒకరు కూర్చోవడం, చేస్తున్నారు.
షణ్ముఖ్ కాంట్రవర్సీ కూడా దూరంగా ఉంటూ, సైలెంట్ గా తన గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నాడని అనిపిస్తుంది. అలాగే సిరి కూడా ఒక అబ్బాయితో రిలేషన్ అనే కాన్సెప్ట్ పై హౌస్ లో మనగలగాలి అని ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.
నిజం ఏదైనా షణ్ముఖ్ ఆట తీరును నెటిజెన్స్ తప్పుపడుతున్నారు. షణ్ముఖ్ కన్నింగ్ అనే అర్థంలో ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఈ సీజన్ హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్ ఒకరు అని తెలుస్తుంది.