- Home
- Entertainment
- లేట్ నైట్ బాత్రూమ్ లో రవితో రొమాన్స్ చేస్తున్న లహరి అంటూ ప్రియ ఆరోపణలు... నీకు కూడా పిల్లలు ఉన్నారంటూ రవి ఫైర్
లేట్ నైట్ బాత్రూమ్ లో రవితో రొమాన్స్ చేస్తున్న లహరి అంటూ ప్రియ ఆరోపణలు... నీకు కూడా పిల్లలు ఉన్నారంటూ రవి ఫైర్
సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టారు బిగ్ బాస్. ఇంటిలోని ప్రతి కంటెస్టెంట్స్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని, గ్లాస్ పై పేరు ముద్రించి అది సుత్తితో పగలగొట్టాలని చెప్పారు.
- FB
- TW
- Linkdin
Follow Us

ఈ నామినేషన్స్ ప్రక్రియ అపార్ధాలకు దారితీసింది. కంటెస్టెంట్ ప్రియ.. రవి, లహరిలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. లహరిని నామినేట్ చేసిన ప్రియ, కారణం చెబుతూ, ఆమె మగాళ్లతో బిజీగా ఉంటూ తనతో ఇంటర్యాక్ట్ కావడం లేదని, అందుకే నామినేట్ చేస్తున్నానని,చెప్పింది.
ఎవరితో నన్ను చూశావ్ అని లహరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ప్రియ, నువ్వు లేట్ నైట్ బాత్రూం దగ్గర హగ్ చేసుకోవడం నేను చూశానని, అన్నారు. ప్రియ కామెంట్స్ కి రవి, లహరి హర్ట్ అయ్యారు. అలాగే ప్రియ పై ఫైర్ అయ్యారు.
నేషనల్ ప్లాట్ ఫార్మ్ వేదికగా తనపై ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారని లహరి ఆవేదన చెందారు. ఇక రవి తన కూతురు మీరు చేసిన కామెంట్స్ తప్పుగా తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రియను నిలదీశారు. మొత్తంగా ప్రియ కామెంట్స్ పెద్ద దుమారానికి దారితీశాయి.
పెళ్లి కాని లహరిపై ఇలాంటి కామెంట్స్ చేయకండి అంటూ రవి ప్రియకు తెలిపారు. నేను మీరు హగ్ చేసుకున్నారు అన్నాను, కానీ తప్పు చేస్తున్నారని అనలేదు అన్నారు.
ప్రస్తుతానికి శ్రీరామ్ ని ఎక్కువ మంది నామినేట్ చేయడం జరిగింది. నేటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాలేదు. రేపు ఎపిసోడ్ లో ఎవరు నామినేషన్స్ లో ఉన్నారనే విషయంపై స్పష్టత రాలేదు.
ఇక బిగ్ బాస్ షో రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం సరయు ఎలిమినేట్ కాగా, గత వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 17మంది కొనసాగుతున్నారు.
గత నాలుగు సీజన్స్ పోల్చుకుంటే లేటెస్ట్ సీజన్ కొంచెం వైల్డ్ గా సాగుతుంది. కంటెస్టెంట్స్ బూతులు తిట్టుకోవడం, ఫిజికల్ ఫైట్ కి దిగడం, వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేసుకోవడం చేస్తున్నారు. ఇక సంప్రదాయ వాదులను నుండి ఈ షోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.