- Home
- Entertainment
- Bigg boss Telugu OTT:లేచిపోయి పెళ్లి చేసుకున్న ఈ కంటెస్టెంట్ కి రెండు పెళ్లిళ్లు.. నాగార్జున షాక్
Bigg boss Telugu OTT:లేచిపోయి పెళ్లి చేసుకున్న ఈ కంటెస్టెంట్ కి రెండు పెళ్లిళ్లు.. నాగార్జున షాక్
బిగ్ బాస్ ఓటీటీ(Biggboss OTT) వర్షన్ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ షోలో 6వ కంటెస్టెంట్ గా సోషల్ మీడియా సెన్సేషన్ స్రవంతి చొక్కారపు(Sravanthi chokkarapu) ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు.

ఈటీవీ నిర్వహిస్తున్న కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా స్రవంతి పలుమార్లు కనిపించారు. యూట్యూబ్ ప్రేక్షకులను కూడా స్రవంతి పరిచయం అక్కర్లేని పేరు. అయితే స్రవంతి గురించి ఫ్యాన్స్ కి తెలియని ఓ పర్సనల్ సీక్రెట్ ఆమె బయటపెట్టారు.
స్రవంతికి రెండు వివాహాలు జరిగాయట. ఆమె తన మొదటి వివాహం లేచిపోయి పెళ్లి చేసుకున్నారట. స్రవంతి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారట. తర్వాత ఆమెకు పెద్దవాళ్ళు రెండో వివాహం చేశారట. బిగ్ బాస్ వేదికగా తన హస్బెండ్ తో పాటు కొడుకుని పరిచయం చేసింది. ఇంత వరకు స్రవంతి సోషల్ మీడియా ఫ్యాన్స్ కి ఈ విషయం తెలియదు.
స్రవంతి ఛాలెంజర్ గా ఎంట్రీ ఇచ్చారు. హీరో అజయ్, శ్రీరాపాక, స్రవంతి, ఆర్జే చైతు చాలెంజర్స్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అటు వారియర్స్ లో నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, అరియనా, ముమైత్ ఖాన్, మహేష్ విట్టా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో పాత కంటెస్టెంట్స్ కొత్త కంటెస్టెంట్స్ కలిసి గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా గత ఐదు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, అసలు పాల్గొనని కంటెస్టెంట్స్ ని ఛాలెంజర్స్ గా విభజించారు. అంటే టాస్క్, గేమ్స్ కూడా వారియర్స్, ఛాలెంజర్స్ మధ్య నడుస్తాయేమో చూడాలి.
ఇక బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు.కాగా బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ రెగ్యులర్ బిగ్ బాస్ షోకి చాలా భిన్నం. ఇది 24/7 ప్రసారం కానుంది. అంటే ప్రతి నిమిషం కంటెస్టెంట్స్ గేమ్ లో భాగంగా ఉంటారు.
గేమ్స్, టాస్క్ విషయంలో మాత్రం పోలిక ఉంటుంది. ఇక బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ కి పరిమితులు తక్కువ. అంటే రొమాన్స్ పాళ్ళు ఎక్కువగా ఉండే ఆస్కారం కలదు. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలోనే కంటెస్టెంట్స్ ఓ రేంజ్ రొమాన్స్ కురిపిస్తున్నారు. ఇది ఓటీటీ కాబట్టి అడల్ట్ కంటెంట్ పరిమితులు దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేడు సాయంత్రం 6 గంటల నుండి బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రసారం కానుంది.