Inaya Sulthana: మేకప్ లేకుండా చెమటలు పట్టిన శరీరంలో బిగ్ బాస్ ఇనయ... బోల్డ్ వీడియో వైరల్ !
బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మేకప్ లేకుండా తన అసలైన గ్లామర్ పరిచయం చేస్తూ క్రేజీ వీడియో చేసింది. ఇనయ గ్లామర్ పై కుర్రాళ్ళు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
Inaya Sulthana
ఇనయ సుల్తాన బిగ్ బాస్ వేదికగా ఫేమ్ తెచ్చుకుంది. సీజన్ 6లో పార్టిసిపేట్ చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా వారాలు హౌస్లో ఉంది. ఇనయ బోల్డ్ గేమ్ ఆడింది. తన ప్రియుడిని నేరుగా ప్రకటించింది.
Inaya Sulthana
కంటెస్టెంట్ ఆర్జే సూర్య అంటే తనకు ఇష్టం అని కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ కి చెప్పింది. చెప్పిందే తడవుగా అతడికి దగ్గరైంది. ఒకే కంచంలో తింటూ, ముద్దులు, హగ్గులు లాగిస్తూ రొమాన్స్ చేశారు. వీరి రొమాన్స్ హద్దులు దాటడంతో నాగార్జున హెచ్చరించాల్సి వచ్చింది.
Inaya Sulthana
ఇనయ గేమ్ కూడా వదిలేసి సూర్య ప్రేమలో మునిగిపోయింది. నాగార్జున వార్నింగ్ అనంతరం దూరం అవుతున్నట్లు నటిద్దాం అని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇనయ సూర్యను నామినేట్ చేసింది. ఆ వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. అందుకు గుక్కపెట్టి ఏడ్చింది. హౌస్లో ఇనయ సూర్య జ్ఞాపకాలతో బ్రతికింది.
Inaya Sulthana
ఇనయకు ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అనుకున్నారు. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. అనూహ్యంగా ఫైనల్ కి ముందు ఇనయ ఎలిమినేట్ అయ్యింది. ఇనయ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఎవరినో కాపాడడానికి ఇనయ సుల్తానను ఎలిమినేట్ చేశారనే కామెంట్స్ వినిపించాయి.
Inaya Sulthana
ప్రస్తుతం ఇనయ నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా మేకప్ లేకుండా బోల్డ్ వీడియో ఒకటి చేసింది. ఇనయ వీడియో చాలా రా అండ్ రస్టిక్ గా ఉంది.
Inaya Sulthana
కాగా ఇనయను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వర్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సదరు ఫోటోలలో ఉన్న ఇనయ పాప్యులర్ అయ్యింది. ఈ అమ్మాయి ఎవరనే చర్చ నడిచింది.
Inaya Sulthana
కనీసం వర్మ అయిన తన సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చి ఇనయను ఆదుకుంటే బాగుండు. తాను నటి కావడాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని, అందరినీ ఎదిరించి నేను పరిశ్రమకు వచ్చానని ఇనయ సుల్తాన బిగ్ బాస్ హౌస్లో చెప్పడం విశేషం.
‘జబర్దస్త్’ కొత్త యాంకర్ ఖతర్నాక్ ఫోజులు చూశారా! సిరి హన్మంతు గ్లామర్ మెరుపులు అదుర్స్