- Home
- Entertainment
- ట్రెడిషనల్ లుక్.. మైమరిపించే స్టిల్స్.. మత్తెక్కించే చూపులతో మాయజేస్తున్న‘బిగ్ బాస్’ హారిక
ట్రెడిషనల్ లుక్.. మైమరిపించే స్టిల్స్.. మత్తెక్కించే చూపులతో మాయజేస్తున్న‘బిగ్ బాస్’ హారిక
యూట్యూబ్ సెన్సేషన్, ‘బిగ్ బాస్’ ఫేమ్ దేత్తడి హారిక (Harika) నెట్టింట అందాలను సమర్పిస్తోంది. అదిరిపోయే ఫొటోషూట్లుతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

‘దేత్తడి’ ఛానెల్ తో యూట్యూబ్ లో అలేఖ్య హారిక సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఫన్నీ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ యూత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలంగా యాస, భాషలో అనర్గళంగా మాట్లాడగల హారిక అదిరిపోయే పంచులు, డైలాగ్ లతో మాస్ పిల్లగా పేరొందింది.
యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 2లోనే అవకాశం దక్కించుకుంది. హౌజ్ లో తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. రియాలిటీ షోలోని ప్రతి టాస్క్ ను చురుకుగా ఆడుతూ తన ఫాలోవర్స్ ను అలరించింది.
హౌజ్ నుంచి బయటికి వచ్చాక హారికకు మరింత క్రేజ్ పెరిగింది. మాస్ అటిట్యూడ్ ఉన్న అమ్మాయి కావడంతో పలు టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతున్న గేమ్ షోల నుంచి గెస్ట్ గా ఇన్విటేషన్ పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెండితెరపై మెరవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది.
తాజాగా హారిక ట్రెడిషనల్ లుక్ లో ఆకర్షిస్తోంది. పిక్ చుడీదార్ ధరించిన బిగ్ బాస్ బ్యూటీ మత్తుచూపులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొంత కాలంగా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో గ్లామర్ షో నెట్టింట రచ్చరచ్చ చేస్తున్న ఈ బ్యూటీ సడెన్ గా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమివ్వడంతో ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.
తను పోస్ట్ చేసిన పిక్స్ కు నెటిజన్లు బ్యూటీఫుల్, క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఫాలోవర్స్ లైక్స్ చేస్తూ హారికకు మద్దుతుగా నిలుస్తున్నారు. వెండి తెరపై మెరవాలని భావిస్తున్న హారిక ఆ దిశగానే ముందుకు వెళ్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగ్ సంపాదించేందుకు గ్లామర్ షోలోనూ వెనకాడటం లేదు. సెక్సీ అవుట్ ఫిట్ లో అదరగొడుతోంది.
ఇప్పటికే ‘గానం’ అనే చిత్రంలో హారిక నటించింది. మరిన్ని సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం హారిక మళ్లీ యూట్యూబ్ లోనే ట్రెండింగ్ లో ఉంటోంది. బాలీవుడ్ స్టార్స్ తో స్పెషల్ చిట్ చాట్స్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. ఇటీవల రణబీర్ కపూర్, తాప్సీ, స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ లను ఇంటర్వ్యూలు చేసింది. వారు నటించిన చిత్రాలు ‘శంశేరా’, ‘శంభాష్ మిథు’లను ప్రమోషన్స్ లో భాగమైంది.