MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గీతూ కారణంగా ఆదిరెడ్డి సంసారంలో చిచ్చు.... నేను ఫ్లాట్ అయ్యింది అప్పుడే అంటూ చిత్తూరు చిరుత షాకింగ్ కామెంట్స్ 

గీతూ కారణంగా ఆదిరెడ్డి సంసారంలో చిచ్చు.... నేను ఫ్లాట్ అయ్యింది అప్పుడే అంటూ చిత్తూరు చిరుత షాకింగ్ కామెంట్స్ 

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తోటి కంటెస్టెంట్ ఆదితో తన రిలేషన్ పై ఓపెన్ అయ్యారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 24 2023, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Aadi Reddy Geetu

Aadi Reddy-Geetu

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి-గీతూ హౌస్లో స్ట్రాంగ్ బాండింగ్ మైంటైన్ చేశారు. గీతూ హౌస్లో ఉన్న తొమ్మిది వారాలు విడిపోకుండా వీరిద్దరూ కలిసున్నారు. గీతక్క అని ఆదిరెడ్డి ఆమెను పిలిచేవాడు. అయితే స్నేహానికి మించిన రిలేషన్ ఏదో వాళ్ళ మధ్య ఉందనే వాదన ఉంది. ఆదిరెడ్డి భార్య కవిత గీతూపై అసహనం చూపించడం ఈ పుకార్లకు బలం చేకూర్చింది. కవిత భర్త ఆదిరెడ్డితో ఆమెతో ఉండొద్దని గట్టిగా చెప్పింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ వార్తలపై తాజాగా గీతూ రాయల్ స్పందించారు. గీతూ మాట్లాడుతూ... ఆదిరెడ్డి నాకు మంచి స్నేహితుడు. హౌస్లో ఆదిరెడ్డితో స్నేహం కుదరడానికి ఓ కారణం ఉంది. హెల్త్ రీజన్స్ తో నేను హౌస్లో చురుగ్గా కదల్లేకపోయాను . నా వంతు పనిగా బాత్ రూమ్స్ కడగాల్సి వచ్చింది. నేను ఇబ్బంది పడుతుంటే ఆదిరెడ్డి వచ్చి నేను కడగనా అన్నాడు. ఒక వ్యక్తి తానె స్వయంగా వచ్చి తనపని  చేస్తాను అనడంతో నేను పొంగిపొయాను. 

37

అప్పుడే ఆదిరెడ్డికి నేను పడిపోయాను. ఫ్లాట్ అయ్యాను. అయితే అది స్నేహం మాత్రమే. ఆదిరెడ్డితో స్నేహంగా ఉండటం, చెవులు పిసకడం వంటి చర్యలు జనాలు ఎలా తీసుకుంటారో అనే సందేహం నాకుంది. అదే విషయాన్ని ఫోన్లో మా నాన్నను అడిగాను. నీకు బుద్ధి లేదని ఆయన తిట్టాడు. 
 

47
Aadi Reddy-Geetu

Aadi Reddy-Geetu

కవితకు నాపై కోపం వచ్చింది. ఆదిరెడ్డిని తక్కువ చేసి మాట్లాడటం. అతని చేత పనులు చేయించుకోవడం కవితకు నచ్చలేదు. ఆదిరెడ్డి పొగిడితే పడిపోతాడు. అందుకే నేను అతన్ని నా మాటలతో తగ్గించేదాన్ని. అందులోనూ కవిత పల్లెటూరి అమ్మాయి. ఆదిరెడ్డి అసలు అమ్మాయిలతో మాట్లాడట. కానీ హౌస్లో నాతో సన్నిహితంగా మెదిలేవాడు. అది కవితకు కొత్తగా తోచింది.

57
Aadi Reddy-Geetu

Aadi Reddy-Geetu

అయితే నేను కవితకు అర్థమయ్యేలా చెప్పాను. ఇప్పుడు అంతా ఓకే. కలిసి వీడియోలు చేశాము. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నాము... అని గీతూ చెప్పుకొచ్చింది. ఎలిమినేటైన రోజు... దేవుడిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ గా ఆదిరెడ్డిని ఆమె అభివర్ణించారు. 
 

67
Aadi Reddy-Geetu

Aadi Reddy-Geetu


 బిగ్ బాస్ రివ్యూవర్ గా గీతూ చాలా పకడ్బందీ ప్లాన్స్ తో హౌస్లో అడుగుపెట్టింది. బిగ్ బాస్ తో పాటు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఫస్ట్ కంటెస్టెంట్ గీతూ అని చెప్పొచ్చు. మిగతా కంటెస్టెంట్స్ కి గేమ్ పట్ల అవగాహన లేని క్రమంలో రెండు మూడు వారాలు ఆమె చుట్టే బిగ్ బాస్ గేమ్ నడిపించాడు. అయితే అది గీతూలో ఓవర్ కాన్ఫిడెన్స్ కి కారణమైంది. 
 

77


9వ వారం అనూహ్యంగా గీతూ ఎలిమినేట్ అయ్యింది. హౌస్ వీడనంటూ గీతూ మారాం చేసింది. భయంకరంగా ఏడ్చింది. ఫస్ట్ టైం ఓ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఆడియన్స్ తో కూడా కన్నీరు పెట్టించింది. రెండు రోజులు క్వారంటైన్ చేసిన రూమ్ కి వెళ్లి అన్నం, నీళ్లు లేకుండా గీతూ ఏడ్చారట. పేరెంట్స్ వచ్చి నచ్చజెప్పడంతో అక్కడ నుండి ఇంటికి వెళ్లారట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. కృష్ణ మనవడి మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Sai Pallavi: సీతగా సాయి పల్లవి 3 లుక్స్ వైరల్, అభిమానులు ఏమంటున్నారంటే?
Recommended image3
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోలు.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరుగుతుంది ఇండస్ట్రీలో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved