బిగ్ బాస్ భామ ఇంట పెళ్లి సందడి... వేడుకలో రచ్చ చేసిన పునర్నవి!

First Published Jan 12, 2021, 2:23 PM IST

టాలీవుడ్ లో పెళ్లిళ్ల సమయం నడుస్తుంది. కొందరు సెలెబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కగా... మరి కొందరు సెలెబ్రిటీల ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది. ఈ మధ్య కాలంలో జరిగిన పెళ్లిళ్లలో నిహారిక వివాహం ప్రత్యేకంగా నిలిచింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమై జరిపిన ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 

తరువాత ఆ స్థాయిలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది సింగర్ సునీత రెండో వివాహం. జనవరి 9న సునీత వివాహం జరిగింది. 42ఏళ్ల సునీత వివాహాన్ని పెళ్లీడుకు వచ్చిన పిల్లలు దగ్గరుండి జరుపగా అందరూ ప్రత్యేకంగా చెప్పుకున్నారు.

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ మరియు హీరోయిన్ వితికా షేరు ఇంటిలో పెళ్లి సందడి నెలకొంది. వితికా షేరు చెల్లెలు పెళ్లి కావడంతో బుల్లితెర, వెండితెర ప్రముఖులు హాజరయ్యారు.

ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న పునర్నవి భూపాళం ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలిచారు. పునర్నవి వితికా షేరు చెల్లి పెళ్లికి హాజరై హుషారుతో హోరెత్తించారు.

పునర్నవి , వితిక బిగ్ బాస్ సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొనసాగారు. పునర్నవి 11వ వారం ఎలిమినేట్ కాగా, వితిక 13వారాలు హౌస్ లో ఉన్నారు.

వితిక తన భర్త  అయిన వరుణ్ సందేశ్ తో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. ఈ మొగుడు పెళ్ళాల మధ్య గిల్లి కజ్జాలు, ప్రేక్షకులకు భలే వినోదం పంచాయి.

ఇక పునర్నవి విషయానికి వస్తే హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ తో  ఆమె రొమాన్స్ హైలెట్ అయ్యింది. ప్రేమ పక్షులుగా మార్కు వేసుకున్న ఈ జంట పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది.

ప్రస్తుతం వితికను ప్రేక్షకులు మరచిపోయారు. పునర్నవి మాత్రం అందిన అవకాశం ఏదైనా చేసుకుంటూ ముందుకు పోతుంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ కమిట్ మెంటల్ ఆహా లో విడుదల అయ్యింది.

అలాగే పునర్నవి నటించిన రొమాంటిక్ ఎంటరైనర్ 'సైకిల్' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది.

పునర్నవి తో పాటు మ‌హ‌త్ రాఘ‌వేంద్ర శ్వేతావ‌ర్మ‌,సూర్య ప్రధాన పాత్రలలో నటించిన సైకిల్ చిత్రాన్ని దర్శకుడు అర్జున్ రెడ్డి తెరకెక్కించారు. 90 స్క్రీన్ లలో సైకిల్ విడుదల కానుందని నిర్మాతలు  పి.రాంప్ర‌సాద్‌, డి.న‌వీన్‌రెడ్డి తెలిపారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?