బిగ్ బాస్ ఫేం శ్వేత వర్మకు ఘోర అవమానం, సోషల్ మీడియాలో ఎమోషనల్ అయిన బ్యూటీ.
బిగ్ బాస్ ఫేమ్ స్వేత వర్మకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ విషయంలో మనసులో బాధతో మదనపడిన స్వేత, సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది. ఏమనుకుందో ఏమో మళ్లీ తన పోస్ట్ ను రిమూవ్ చేసింది. ఇంతకీ స్వేత అంత అవమానం ఏం జరిగింది.

అడపా దడపా సినిమాలు చేసుకుంటూ..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను సంపాధించేకుంటూ ఉండే స్వేత వర్మకు బిబ్ బాస్ ఓ ప్లాట్ ఫామ్ ను క్రియేట్ చేసింది. ఈ షో తరువాత స్వేత వర్మ ఎవరో చాల మందికి తెలిసింది. అప్పటి నుంచీ ఆమె ఏ సినిమాలో కనిపించినా... ఏ షోలో మెరిసినా ఆమకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక రీసెంట్ గా ఆమె ఓ సోషల్ మీడియా ఫోస్ట్ తో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తనకు జరిగిన ఘోర అవమానం గురించి పంచుకుంది. తనను ఎంత అవమానించరో చెపుతూ బాబోధ్వేగానికి గురయ్యింది స్వేత. అంతలోనే తన పోస్ట్ ను డిలెట్ చేసేసింది.
సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనైంది స్వేతా వర్మ. తనకు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారని ఆవేదన చెందింది. తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుని బారం దింపుకుందాం అనుకుంది. తన పోస్ట్ లో ఈ విధంగా రాసింది స్వేత. చాలా బాధగా ఉంది. నాకు ఛాన్స్ ఇచ్చి మళ్లీ వెనక్కు తీసేసుకున్నారు. ఇలా జరగడం నాకు మొదటిసారేమీ కాదు అన్నది.
అంతే కాదు నాకు ఆశలు కల్పించి వెంటన్నే ఆ ఆశలపై నీళ్లు చల్లడం భావ్యమా.. అంటూ ఎమోషనల్ అయ్యింది. బాధను భరించలేకపోతున్నాను అంటూ తన వ్యధను వెల్లడించింది. అంతే కాదు వారం రోజుల వరకు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చింది. స్వేతా వర్మ. అయితే ఈపోస్ట్ పెట్టిన కాసేపటికే ఆ పోస్టును తొలగించింది.
అయితే శ్వేతకు వచ్చింది సినిమా ఛాన్సా .. అది ఎవరు చేసి ఉంటారు. ఎవరు స్వేతను బాధపట్టి ఉంటారు. ఒకవేళ సినిమా అవకాశమైతే దాన్ని ఎవరు ఆఫర్ చేశారు తర్వాత ఎందుకు మళ్లీ వెనక్కు తీసుకున్నారు... ఇంతకీ ఆమె సమస్య తీరిందా లేదా అన్నది మాత్రం తెలియలేదు.
అటు స్వేత కూడా తనకు అన్యా యం చేసిన వారి పేర్లు కాని.. ఆ అవకాశం ఇచ్చిన వారి వివరాలు కాని బయట పెట్టలేదు. బిగ్ బాస్ తో ఫేమస్ అయిన శ్వేత.. పచ్చీస్, రోజ్‌విల్లా, ఏకమ్, నెగటివ్ సినిమాల్లో నటించింది.