- Home
- Entertainment
- సిరి బర్త్ డే రోజు కీలక నిర్ణయం తీసుకున్న శ్రీహాన్... ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?
సిరి బర్త్ డే రోజు కీలక నిర్ణయం తీసుకున్న శ్రీహాన్... ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?
బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, సిరి చాలా కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే.లవర్ సిరి బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన శ్రీహాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Sreehan-Siri
యూట్యూబ్ స్టార్స్ గా ఉన్న సిరి, శ్రీహాన్ బిగ్ బాస్ షోతో పాప్యులర్ అయ్యారు. సీజన్ 5 లో పాల్గొన్న సిరి ఫైనల్ కి చేరారు. ఆమె టాప్ 5 పొజీషన్ అందుకున్నారు. ఇక ఆమె లవర్ శ్రీహాన్ లేటెస్ట్ సీజన్లో పాల్గొని రన్నర్ గా నిలిచాడు. అతడు తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు. నాగార్జున ప్రపోజల్ ఒప్పుకోకుంటే విన్నర్ అయ్యేవాడు.
Sreehan-Siri
రన్నర్ అయినప్పటికీ శ్రీహాన్ రూ. 45 లక్షల వరకూ గెల్చుకున్నాడు. నాగార్జున ఆఫర్ చేసిన రూ. 40 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. ఈ డబ్బులు ఎలా ఖర్చు చేయనున్నావని అడగ్గా... శ్రీహాన్ ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. దాని కోసం కొంత ఖర్చుబెడతాను. అలాగే సిరికి ఇంత వరకు ఖరీదైన బహుమతి ఇవ్వలేదు. ఆమె కోసం మంచి గిఫ్ట్ కొంటాను అన్నాడు.
Sreehan-Siri
కాగా ఇటీవల తన ప్రేయసి సిరి బర్త్ డే జరిగింది. ఈ వేడుకను శ్రీహాన్ గ్రాండ్ గా నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆమెకు వెడ్డింగ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడట. పెళ్లి ప్రపోజల్ పెట్టాడని, ఈ ఏడాది సిరి-షణ్ముఖ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడిప్పుడే వారి కెరీర్ ఊపందుకుంటున్న నేపథ్యంలో శ్రీహాన్ ప్రపోజల్ కి సిరి ఎలా స్పందిస్తారో చూడాలి.
Sreehan-Siri
శ్రీహాన్-సిరిలకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిందని సమాచారం.కాగా శేఖర్ మాస్టర్ నిర్మాతగా శ్రీహాన్-సిరి జంటగా వెబ్ సిరీస్ ప్రకటించారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ సిరీస్ కి సుజిత్ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
ఈ క్రమంలో శ్రీహాన్-సిరిలకు టైం స్టార్ట్ అయ్యింది. ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యే సూచనలు కలవు అంటున్నారు. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. కాగా శ్రీహాన్-సిరి యూట్యూబర్స్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
Sreehan
ప్రస్తుతం సిరి బీబీ జోడి చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో స్టార్ మాలో బీబీ జోడి పేరుతో ఒక డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేశారు. ఈ ఎంటర్టైనింగ్ షోలో సిరి-యాంకర్ రవి జంటగా డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఇక త్వరలో సిరి-శ్రీహాన్ కాంబోలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వారిద్దరికీ మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టే సూచనలు కలవు.