MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 6: బయటకు వచ్చాక క్షణం కూడా ఆగలేకపోయిన ఇనయా... ప్రియుడు సూర్యకు టైట్ హగ్స్!

Bigg Boss Telugu 6: బయటకు వచ్చాక క్షణం కూడా ఆగలేకపోయిన ఇనయా... ప్రియుడు సూర్యకు టైట్ హగ్స్!

 14వ వారం ఇనయా ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే ఇనయా తన ప్రియుడు సూర్యను కలిశాడు. సూర్యతో రొమాంటిక్ గా దిగిన ఫోటో ఇనయా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ప్రేమ జంట మరలా కలిశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 13 2022, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ప్రతి బిగ్ బాస్ సీజన్ కి రెండు మూడు ప్రేమ జంటలు తెరపైకి వస్తాయి. ఒంటరిగా హౌస్లోకి వెళ్లిన అమ్మాయిలు, అబ్బాయిలు జంటలై బయటకు వస్తారు. రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అభిజీత్-హారిక, అఖిల్-మోనాల్ క్రేజీ బిగ్ బాస్ లవర్స్ గా పేరు తెచ్చుకున్నారు. 
 

27
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

లేటెస్ట్ సీజన్ లో ఈ డోసు కొంచెం తగ్గింది. శ్రీహాన్-శ్రీసత్య సన్నిహితంగా ఉంటున్నప్పటికీ సిరి కారణంగా మేము ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య అఫెక్షన్ అయితే ఉంది. సీజన్ 5లో శ్రీహాన్ లవర్ సిరి ఇలానే ఫ్రెండ్ అంటూ షణ్ముఖ్ తో హద్దులు మీరిన రొమాన్స్ చేసింది. సిరి-షణ్ముఖ్ ఒకరికోసం ఒకరు ఏడవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం.. మళ్ళీ ఒకటైపోవడం... అబ్బో చాలా చేశారు. 
 

37
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

కాగా బిగ్ బాస్ సీజన్  6(Bigg Boss Telugu 6) లో కూడా ఒక ప్రేమ జంట అవతరించింది. అది ఇనయా అండ్ సూర్య. మనోడు బిగ్ బాస్ మన్మథుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఫస్ట్ ఆరోహిరావుతో హగ్గులు, ముద్దులు కానిచ్చేశాడు. ఆమె ఎలిమినేట్ అయ్యాక ఇనయాను లైన్లో పెట్టాడు. అయితే ఇనయానే ముందుగా తన లవ్ ఎక్స్ప్రెస్ చేసింది. సూర్య నా క్రష్ అని మొహమాటం లేకుండా చెప్పింది. 
 

47
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


ఇంటి సభ్యులు, ఆడియన్స్ కి వారి రిలేషన్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తెలిసిన వ్యవహారమే కదా అని సూర్య-ఇనయా పాలు నీళ్లలా హౌస్లో కలిసిపోయారు. ఒకే మంచం ఒకే కంచం అన్నట్లు పరిస్థితి వచ్చింది. పూర్తిగా ఇన్వాల్వ్ అయిన ఇనయా గేమ్ కూడా పక్కన పెట్టేసింది. దీంతో నాగార్జున క్లాస్ పీకాడు. గేమ్ పూర్తిగా డల్ అయ్యిందని చెప్పడంతో ఇనయా-సూర్య ఒక ఒప్పందానికి వచ్చారు.కొద్దిరోజులు డిస్టెన్స్ మైంటైన్ చేద్దామని డీల్ చేసుకున్నారు. 
 

57
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఈ క్రమంలో సూర్యను ఇనయా(Inaya Sulthana) నామినేట్ కూడా చేసింది. అనూహ్యంగా ఆ వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. దీంతో నమ్మినవాడికి వెన్నుపోటు పొడిచావ్ అంటూ శ్రీహాన్, శ్రీసత్య ఆమెను మాటలతో బాధపెట్టాడు. సూర్య ప్లేటులో తింటూ, కప్పులో తాగుతూ అతని జ్ఞాపకాలతో ఇనయా బ్రతికేసింది.

67
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


కాగా 14వ వారం ఇనయా ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే ఇనయా తన ప్రియుడు సూర్యను కలిశాడు. సూర్యతో రొమాంటిక్ గా దిగిన ఫోటో ఇనయా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ప్రేమ జంట మరలా కలిశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

77
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

అయితే హౌస్ నుండి బయటకు వచ్చాక సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇనయా నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే. అలాగే బుజ్జమ్మ కూడా ఫ్రెండే. నేను పెద్దవాళ్ళు కుదిర్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. గతంలో  అమ్మాయిని ప్రేమిస్తే మోసం చేసిందని సూర్య చెప్పడం కొసమెరుపు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే.. శోభన్ బాబు తో కంఫర్ట్ ఎక్కువ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
రజినీకాంత్ ను కొట్టమనందుకు.. సినిమానే వదిలేసిన స్టార్ హీరోయిన్? ఖుష్బూ మిస్ అయిన మూవీ ఏదో తెలుసా?
Recommended image3
రామాయణ టీజర్.. రాముడిని దించేసిన రణ్‌బీర్ కపూర్.. మరో ఆదిపురుష్ అవుతుందా? మళ్ళీ అదే తప్పు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved