- Home
- Entertainment
- Bigg boss Divi:అబ్బా ఏం అందంరా బాబు... కిల్లింగ్ స్మైల్ తో హార్ట్ బ్రేక్ చేస్తున్నబిగ్ బాస్ దివి
Bigg boss Divi:అబ్బా ఏం అందంరా బాబు... కిల్లింగ్ స్మైల్ తో హార్ట్ బ్రేక్ చేస్తున్నబిగ్ బాస్ దివి
బిగ్ బాస్ సీజన్ 4 (Biggboss Telugu 4) లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో దివి ఒకరు. ఈ పొడుగుకాళ్ల తెలుగు బ్యూటీ ఆ షో తరవాత పిచ్ ఫేమస్ అయ్యారు. ఇక వచ్చిన గుర్తింపును డబుల్ చేసుకునే పనిలో ఉన్న దివి వరుస ఫోటో షూట్స్ తో కాకరేపుతోంది.

తాజాగా బ్లూ ట్రెండీ వేర్ ధరించిన దివి మెస్మరైజ్ చేశారు. పున్నమి చంద్రుడు వలె ముఖం మెరిసిపోతుండగా.. నవ్వులతో చంపేసింది. దివి నవ్వులకు కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతుండగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
అందాల దివి(Divi) ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. గతంతో పోల్చితే బిగ్ బాస్ తర్వాత దివి కెరీర్ ఒకింత మెరుగైంది. ఆమెకు పలు రకాల పాత్రలు, అవకాశాలు దక్కుతున్నాయి.
హీరోయిన్ గా వెలిగిపోవాలన్న దివి ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. ఒక్క క్లీన్ హిట్ ఖాతాలో పడితే దివి ఫేట్ మారిపోయినట్లే. ఆ మధ్య దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ పర్వాలేదు అనిపించుకుంది.దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి.
వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ బోల్డ్ నెస్ చూపిస్తున్న దివి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. దివి టాలెంట్, గ్లామర్ ని టాలీవుడ్ సరిగా ఉపయోగించుకోవడం లేదని చెప్పాలి. తెలుగు అమ్మాయి కావడం కూడా ఆమెకు మైనస్.
టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పొరుగింటి పుల్లకూరే రుచి. ఒడ్డు పొడుగు, అందం అభినయం ఉన్న తెలుగు అమ్మాయిలు అనేక మంది ఉన్నా... కోట్లు కుమ్మరించి ఆ బాలీవుడ్ హీరోయిన్స్ ని తెచ్చుకుంటున్నారు. మలయాళ, కన్నడ భామలకు దక్కుతున్న ఆదరణ కూడా తెలుగు హీరోయిన్స్ కి దక్కడం లేదు.
ఇక దివి తన గ్లామర్ తో అప్పుడే రికార్డులు కూడా కొట్టేస్తోంది. 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్' గా 2020 టివి విభాగంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకోవడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది.
సినిమాల్లో నటించాలని, తనని తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక ఉందని దివిఆమద్యన తెలిపింది. మంచి అవకాశాలు దక్కితే మాత్రం దివి హీరోయిన్ గా తక్కువ టైంలోనే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం.