- Home
- Entertainment
- నాభీ అందాలు చూపిస్తూ అరియానా గ్లోరీ గ్లామర్ స్టెప్పులు.. రకరకాలుగా కామెంట్లు.. రచ్చరచ్చ!
నాభీ అందాలు చూపిస్తూ అరియానా గ్లోరీ గ్లామర్ స్టెప్పులు.. రకరకాలుగా కామెంట్లు.. రచ్చరచ్చ!
‘బిగ్ బాస్’తో ఫేమ్ సంపాదించుకున్న యాంకర్ అరియానా గ్లోరీ (Ariyana Glory) సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. గ్లామర్ షోలో హద్దుల్ని చెరిపేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ సాంగ్ కు డాన్స్ చేస్తూ మతులు పోగొట్టింది.

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. నాజుకూ అందాలను ఎరగా వేస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. నెట్టింటే తిష్ట వేసిన కుర్ర భామా నిత్యం క్రేజీ అప్డేట్స్ అందిస్తూ నానా రచ్చ చేస్తోంది.
ఇప్పటికే మతులుపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను ఆరబోస్తున్న అరియానా గ్లోరీ ఇటీవల డాన్స్ వీడియోలతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకోసం రిహార్సల్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె - షారుఖ్ ఖాన్ జంటగా నటించిన ‘పఠాన్’ చిత్రంలోని ‘బేశరమ్ రంగ్’ సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో తెలిసిందే. అదే సాంగ్ కు తాజాగా అరియానా గ్లామర్ స్టెప్పులేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ప్రతి విషయాన్ని నెటిజన్లతో షేర్ చేసుకునే ఈ బ్యూటీ తాజాగా ఆ డాన్స్ వీడియోను కూడా పంచుకుంది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఎంకరేజ్ చేస్తుంటే మరికొందరు విమర్శిస్తూ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వెల్లడిస్తున్నారు.
కొందరు ఇందులో డాన్స్ ఎక్కడుంది.. ఎక్సిపోజింగ్ తప్పా అంటుంటే.. మరికొందరు మాత్రం బాగా ప్రయత్నం చేసిందంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం రీసెంట్ గా తను ప్రకటించిన ‘షో’ ఇదేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎక్కువ మంది మాత్రం అరియానాను సపోర్ట్ చేస్తున్నారు.
మరోవైపు అరియానా డాన్స్ వీడియోతో గ్లామర్ విందు చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టైట్ ఫిట్ లో, టీషర్ట్ పైకి ముడేసి.. నాభీ అందాలను చూపిస్తూ గ్లామర్ స్టెప్పులేయడంతో ఖుషీ అవుతున్నారు. అమ్మడు అందాల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఏదేమైనా అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారేందుకు ప్రయత్నిస్తుంటుంది. రీల్స్, ఫొటోషూట్లు, తను హోస్ట్ చేస్తున్న షోలకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. బుల్లితెరపై ఆడియెన్స్ ను అలరిస్తూ పాపులారిటీని పెంచుకుంది.
ఆర్జీవీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న అరియానా ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ సీజన్ 4లో అవకాశం దక్కించుకుంది. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా బయటికి వచ్చాక మరింత పాపులారిటీని దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘బీబీ జోడి’తో అలరిస్తోంది.