- Home
- Entertainment
- హోస్ట్ గా నాగార్జున ఫెయిల్, అంతా స్క్రిప్టెడ్... బిగ్ బాస్ షో బండారం బయటపెట్టిన గీతూ రాయల్!
హోస్ట్ గా నాగార్జున ఫెయిల్, అంతా స్క్రిప్టెడ్... బిగ్ బాస్ షో బండారం బయటపెట్టిన గీతూ రాయల్!
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. నాగార్జున హోస్టింగ్ అంతా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది. ఆయన షో చూడరంటూ అసలు సీక్రెట్ బయటపెట్టింది.

గత ఐదు సీజన్స్ గా బిగ్ బాస్ తెలుగు షోకి నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. వారాంతంలో వచ్చి కంటెస్టెంట్స్ గేమ్, ప్రవర్తనను సమీక్షించడం, తప్పు ఒప్పులు చెప్పడం బిగ్ బాస్ హోస్ట్ బాధ్యత. కంటెస్టెంట్స్ విషయంలో హోస్ట్ జడ్జిమెంట్ ఖచ్చితంగా ఉండాలి. ప్రేక్షకుల అభిప్రాయాలను ప్రతిబించేదిగా ఉండాలి.
కంటెస్టెంట్స్ ప్రవర్తనపై ఆడియన్స్ కి ఇక అభిప్రాయం ఉంటుంది. హోస్ట్ ఒపీనియన్ కూడా దగ్గరగా ఉండాలి. తప్పు చేసిన వారిని సమర్ధించి ఇన్నోసెంట్స్ ని టార్గెట్ చేస్తేనే అసలు సమస్య. నాగార్జున పలు సందర్భాల్లో రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ గీతూ రాయల్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
గీతూ మాట్లాడుతూ... నాగార్జున హోస్టింగ్ సీజన్ సిక్స్ వరకు చప్పగా సాగింది. ఈ సీజన్లో బాగుంది. నేను బిగ్ బాస్ రివ్యూవర్ గా ఉన్నప్పుడు షో చూసి ఇవాళ నాగార్జున చేతిలో వాళ్లకు ఉంది అందుకునేదాన్ని. ఆయన మాత్రం చాలా కూల్ హాయ్ అంటూ ఎవరినీ ఏమనేవారు కాదు. నాగార్జున బెండు తీసే ప్రశ్నలు అడగరు. హోస్ట్ గా నాగార్జున ఫెయిల్.
ఎందుకు అన్నానంటే ఆయన షో చూడరు. నాగార్జున ఎపిసోడ్స్ చూసి జడ్జి చేస్తారు అనుకున్నాను. కానీ ఆయన స్క్రిప్ట్ ఫాలో అవుతారు. ఆ విషయం నాకు ముందు తెలియదు. స్క్రిప్ట్ లో ఉన్న దాని ప్రకారమే ఆయన మాట్లాడతారు. చంటితో నాకు గొడవైంది. చంటి కీర్తిని అన్నమాట వాస్తవం. కానీ నేను తప్పు చేసినట్లు వీడియో తిప్పితిప్పి చూపించారు.
సీజన్ 5లో సన్నీ-షణ్ముఖ్ కి గొడవ జరిగితే తప్పు చేసిన షణ్ముఖ్ ని కాకుండా... సన్నీని తిట్టారు. రేవంత్ కెప్టెన్ గా ఉండి నిద్రపోవడం వలన మాకు నష్టం జరిగింది. 10 పాయింట్స్ కోల్పోయాము. కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడే ఛాన్స్ మిస్ అయ్యింది. నాగార్జున మాత్రం 'ఏంటయ్యా రేవంత్ కెప్టెన్ గా ఉండి నిద్రపోతావా...' అని నవ్వుతూ సిల్లీగా కొట్టిపారేశారు.
రేవంత్ ప్లేస్ లో మరొకరు ఉంటే ఆయన కోప్పడేవారు. అందుకే బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా కంటెస్టెంట్స్ ని జనాలు అడగాలనుకున్న ప్రశ్నలు నేను అడిగాను. కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటికి లోబడి అడిగాను. బిగ్ బాస్ బజ్ లో నేను అడిగినవన్నీ నా ప్రశ్నలే... అని ఆమె చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ 7లో మాత్రం నాగార్జున కంటెస్టెంట్స్ పట్ల సీరియస్ గా ఉండి. బాగా చేశారని ఆమె అన్నారు.
నాగార్జున షో చూడరు. స్క్రిప్టెడ్ అని సందేహాలు చాలా కాలంగా ఉన్నాయి. గీతూ కామెంట్స్ తో క్లారిటీ వచ్చింది. నిజానికి ఏ హోస్ట్ షో 24 గంటలు చూడరు. హోస్ట్ ఒక స్టార్ హీరో అయి ఉంటాడు. వాళ్లకు క్షణం తీరిక ఉండదు. అందుకే జస్ట్ స్క్రిప్ట్ ఫాలో అవుతారు.