- Home
- Entertainment
- ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన `బిగ్ బాస్`.. ఆరు సీజన్లలో ఇదే ఫస్ట్ టైమ్.. ఆద్యంతం ఉత్కంఠభరితం..
ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన `బిగ్ బాస్`.. ఆరు సీజన్లలో ఇదే ఫస్ట్ టైమ్.. ఆద్యంతం ఉత్కంఠభరితం..
బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో సరికొత్తగా ఓ మెలిక పెట్టాడు. `ఎలిమినేషన్` ప్రక్రియలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు.

బిగ్ బాస్(Bigg Boss) తెలుగు చరిత్రలోనే బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటి సభ్యులు ఆశ్చర్యపోయేలా, ఆడియెన్స్ షాక్ అయ్యేలా ఓ ప్రకటన చేశారు. ఎలిమినేషన్‌లో సరికొత్త పంథాకి తెరలేపారు. ఇంతకి ఏం జరిగిందంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6(Bigg Boss Telugu 6) గత ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. షో ప్రారంభమై నేటికి(ఆదివారం)కి ఎనిమిది రోజులయ్యింది.
21 మందితో ప్రారంభమైన ఈ షో మొదటి వారంతం ఎలిమినేషన్(Bigg Boss Elimination) ప్రక్రియకి చేరుకుంది. ఆదివారం నామినేట్ అయిన సభ్యుల్లో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. ఇందులో ఎప్పటిలాగే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు హోస్ట్ నాగ్. చివరగా ఎలిమినేషన్‌కి ఇనయ సుల్తానా(Inaya Sulthana), అభినయశ్రీ(Abhinaya Sri) మిగిలారు. వీరిద్దరిని గార్డెన్ ఏరియాకి పిలిచిన నాగ్(Nagarjuna), అక్కడున్న రెండు భారీ సుత్తెలను ఎత్తాల్సి ఉంటుంది. అందులో దాన్ని లేపలేని వారి ఎలిమినేట్ అవుతారని తెలిపారు. కానీ ఇద్దరు లేపడంతో అంతా షాక్ అయ్యారు.
నెమ్మదిగా అసలు విషయం రివీల్ చేశాడు నాగార్జున. మొదటి వారం ఎలిమినేషన్ తీసేస్తున్నట్టు ప్రకటించారు. ఆరు సీజన్లలో మొదటి సారి బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇంటి సభ్యులు వచ్చి వారం రోజులే అవుతుంది కదా అని, సెట్ కావడానికి కాస్త టైమ్ పడుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో అటు ఇనయ రెహ్మాన్, అభినయశ్రీతోపాటు ఇంటి సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎగిరి గంతులేశారు.
ఇదిలా ఉంటే మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు 6 నుంచి అభినయశ్రీ ఎలిమినేట్ అవుతుందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఏకంగా అభినయ శ్రీ ఎలిమినేషన్ అంటూ పోస్టర్లు కూడా కనిపించాయి. కానీ ఊహాగనాలకు షాకిస్తూ బిగ్ బాస్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. చంటి, రేవంత్, శ్రీ సత్య, ఆరోహి, ఇనయా, అభినయశ్రీ, ఫైమా మొదటి వారి ఎలిమినేషన్‌కి నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఆదివారం గేమ్‌లో మొదటగా `స్టార్ ఆఫ్ ది వీక్` అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో హౌజ్ మేట్స్ గురించి ఎవరు కరెక్ట్ గా, ఎక్కువ సమాధానాలు చెబితే వారు విన్నర్. ఇందులో మొదటి వారం కెప్టెన్‌గా ఎన్నికైన బాలాదిత్య ఎక్కువగా కరెక్ట్ చెప్పి విన్నర్‌గా నిలిచారు. ఆయనకు బిగ్ బాస్ ఓ గిఫ్ట్ ని పంపించడం విశేషం. అయితే ఇందులో అమ్మాయిల గురించి చెబుతూ బుట్టబొమ్మ మరీనా అని, గీతూ రాయల్ సీతమ్మ అని, శ్రీ సత్య పువ్వులాంటిదని, ఆరోహి థౌజండ్ వాలా అని, వసంతి బ్యూటీపుల్ అని, నేహా స్ప్రింగ్ అని, ఫైమా ఎంటర్ టైనర్ అని చెప్పాడు.
అనంతరం ఐటెమ్ నంబర్స్ గేమ్ పెట్టారు నాగార్జున. ఇందులో ఆయన వస్తువుల ఫోటోలను చూపిస్తే ఆ వస్తువుపై ఉన్న పాట ఏంటో చెప్పాల్సి ఉంది. ఇందులో ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టారు. రేవంత్, చంటి, ఆర్జేసూర్య, అభినయశ్రీ, సత్యశ్రీ, నేహా, ఆరోహి, మేరినా, అర్జున్, కీర్తి ఏ టీమ్‌లో ఉన్నారు. మిగిలిన వాళ్లు బి టీమ్‌లో ఉన్నారు. ఇందులో ఎక్కువగా పాటలు కరెక్ట్ గా చెప్పి ఏ టీమ్ విన్నర్‌గా నిలిచింది.