- Home
- Entertainment
- ఎనిమిదో వారం ఎలిమినేషన్.. బిగ్ బాస్ తెలుగు 9 నుంచి ఈ కంటెస్టెంట్ ఔట్.. తనూజ చేతిలో అసలైన పవర్
ఎనిమిదో వారం ఎలిమినేషన్.. బిగ్ బాస్ తెలుగు 9 నుంచి ఈ కంటెస్టెంట్ ఔట్.. తనూజ చేతిలో అసలైన పవర్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఎనిమిదో వారం హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం.

8వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఈ వారం ఎలిమినేషన్ ఉత్కంఠభరితంగా మారింది. ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్‌లో దివ్వెల మాధురి, తనూజ, సంజనా, రీతూ చౌదరీ, రాము రాథోడ్, కళ్యాణ్, డీమాన్ పవన్, గౌరవ్ గుప్తాలు ఉన్నాయి. వీరిలో ఎలిమినేట్ ఎవరు అవుతారో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. ఓటింగ్ ప్రకారం చూస్తే గౌరవ్ గుప్తా లీస్ట్ లో ఉన్నారు. ఆయనతోపాటు దివ్వెల మాధురి కూడా లీస్ట్ లోనే ఉంది. వీరి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. అది చాలా మైన్యూర్‌గా ఉండటం విశేషం.
గౌరవ్ గుప్తా ఎలిమినేట్?
ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ దివ్వెల మాధురి, గౌరవ్ గుప్తాల మధ్యనే ఉంటుందని సమాచారం. అయితే ఇప్పటి వరకు తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఈ వారం హౌజ్‌ని వీడేది గౌరవ్ గుప్తా అని టాక్. ఆయన ఎలిమినేషన్ ఆల్‌రెడీ ఫైనల్ అయ్యిందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట. కాకపోతే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. టాస్క్ ల పరంగా, కంటెంట్ ఇచ్చే విషయంలో మాధురితోపోల్చితే గౌరవ్ డల్‌గా ఉన్న మాట వాస్తవమే. లాంగ్వేజ్ కూడా మెయిన్ సమస్యగా మారింది. ఎవరితోనూ ఆయన సరిగా మాట్లాడలేకపోతున్నారు. అందుకే కంటెంట్ ఇవ్వలేకపోతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ వారం ఆయన్ని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం.
తనూజ.. దివ్వెల మాధురిని సేవ్ చేస్తుందా?
ఇదిలా ఉంటే ఇందులో మరో ట్విస్ట్ ఉందట. తనూజ వద్ద డైమండ్ పవర్ ఉంది. ఆ పవర్‌ని ఉపయోగించి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది. మాధురి, గౌరవ్ ఫైనల్ ఎలిమినేషన్‌లో ఉండగా నాగార్జున తనూజని అడగ్గా, ఆమె మాధురిని సేవ్ చేసేందుకు తన పవర్‌ని ఉపయోగించినట్టు సమాచారం. దీంతో మాధురి సేవ్ అయ్యిందని, దీంతో గౌరవ్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారం బయటకు రావాల్సి ఉంది. అదే సమయంలో ఈ వారం ఎలిమినేషన్ లేకపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
ఎన్ని ప్రయోగాలు చేసినా రేటింగ్ లో డల్‌గా బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లో చాలా ప్రయోగాలు చేస్తున్నారు. అనేక ట్విస్ట్ లు, టర్న్ లతో షోని నడిపిస్తున్నాయి. ప్రతి వారం కొత్త ట్విస్ట్ తో షోపై ఎంగేజ్‌ని పెంచుతున్నారు. అయితే ట్విస్ట్ లు బాగానే ఉన్నా, అది రేటింగ్ తేవడంలో సక్సెస్ కాలేకపోతున్నట్టు సమాచారం. దీంతో నిర్వాహకులు తలపట్టుకుంటున్నారట. హౌజ్‌లో తెలిసిన కంటెస్టెంట్లు లేకపోవడం, ఉన్న వాళ్లు కూడా పెద్దగా కంటెంట్ ఇవ్వకపోవడంతో ఆ రేటింగ్ రావడం లేదని టాక్. ఇమ్మాన్యుయెల్, తనూజ, రీతూ, పవన్, సుమన్ శెట్టి, సంజనాలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన వాళ్లు ఉన్నారా లేరా అన్నట్టుగానే ఉంటున్నారు. దీంతో వీరి విషయంలో విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకే ఈ ట్విస్ట్ లు ఇస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు. ఏదేమైనా గత సీజన్లతో పోల్చితే ఈ సారి షో డల్‌గా ఉన్నమాట వాస్తవమే.