Bigg Boss Telugu 6 Winner: ఈ సీజన్ విన్నరో తేలిపోయిందే.. అతడిదే బిగ్ బాస్ టైటిల్?
బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తుంది. 12 వారాలు పూర్తయ్యింది. మరో మూడు వారాల్లో షో మొత్తం పూర్తి కాబోతుంది. తాజాగా ఈ సీజన్ విన్నర్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చింది. సెలబ్రిటీలో విన్నర్ ని తేల్చేశారు.
గతేడాది బిగ్ బాస్(Bigg Boss Winner) విన్నర్‌ని చివరి వరకు గెస్ చేయడం కష్టమైంది. చివర్లోనే ఓ క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు మరో మూడు వారాలు ఉండగానే ఈ సీజన్ విన్నర్ ఎవరో ఓ క్లారిటీ వచ్చేసింది. శనివారం బిగ్ బాస్ 6 తెలుగు(Bigg Boss Telugu 6) షోకి వచ్చిన సెలబ్రిటీలు ఈ సీజన్ విన్నర్‌గా తేల్చేశారు. ముందుకు అతనే విన్నర్ అనే ఊహాగానాలు వినిపించాయి. కానీ శనివారం ఎపిసోడ్‌తో దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
శనివారం ఎపిసోడ్లో 9మంది కంటెస్టెంట్ల కోసం వారి ఫ్యామిలీ మెంబర్‌తోపాటు ఓ సెలబ్రిటీ షోలో సందడి చేశారు. గత బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సినిమా సెలబ్రిటీలు ఇందులో పాల్గొని సందడి చేశారు. పోతూ పోతూ పరోక్షంగా విన్నర్‌ని డిసైడ్ చేశారు. ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అతనే అని చెప్పకనే చెప్పేశారు.
ఇందులో ఇద్దరు సెలబ్రిటీలు తప్ప మిగిలిన వారంతా వాళ్లొచ్చిన కంటెస్టెంట్‌కి కాంపిటీషన్ రేవంత్ (Revanth) అని ఏకతాటిగా చెప్పారు. ఈ లెక్కన అందరికి రేవంత్ కాంపిటీటర్ అని పేర్కొన్నారు. ఇక ఈటీవీ ప్రభాకర్ అయితే అతనే హౌజ్‌లో చాలా స్ట్రాంగ్ ఉన్నాడని, అతన్ని కొట్టిన వాడే బిగ్ బాస్ విన్నర్ అని పేర్కొన్నారు. అంటే రేవంత్‌ని కొట్టడం అంత ఈజీ కాదని, సో ఈ సీజన్ టైటిల్ ఆయనదే అని తీర్మానించ్చేశారు. ఆయన మాత్రమే కాదు, అందరి అభిప్రాయం కూడా అదే.
మరోవైపు బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీ ఏకంగా పరోక్షంగా హింట్ ఇచ్చేశాడు. తాను చాలా లాజికల్‌గా పెడుతున్నా, విన్నర్ ఎవరో తెలిసిపోతుందనే హింట్ ఇచ్చాడు. ఆయన శ్రీహాన్(Srihan) కోసం వచ్చిన శివబాలాజీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. శ్రీహాన్‌కి కాంపిటీటర్ రేవంత్ అని చెప్పాడు. అదే సమయంలో సీజన్ విన్నర్ కూడా అతనే అని తన సైగలతో చెప్పడం విశేషం.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 హౌస్‌లో రేవంత్, శ్రీహాన్ బలంగా ఉన్నారు. ఇప్పుడు ఊహించని విధంగా ఇనయ దూసుకొచ్చింది. ఆదిరెడ్డి మొన్నటి వరకు బాగానే ఉన్నా, ఈ మధ్య ఆయన ఇమేజ్ పడిపోయింది. నెమ్మదిగా డౌన్ అవుతున్నాడు. దీంతో శ్రీసత్య, రోహిత్, రాజ్, ఫైమా, కీర్తి వంటి వారంతా ఆ తర్వాతి స్థానాల్లోనే నిలవబోతున్నారని తెలుస్తుంది. నిజానికి ఈ సీజన్ విన్నర్ రేవంతే అని షో ప్రారంభం నుంచే టాక్ వినిపించింది. ఆ ఒప్పందంతోనే వచ్చారనే గుసగుసలు వచ్చాయి. ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే అదే విషయాన్ని చెబుతున్నాయి. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు విన్నర్‌గా రేవంత్ పేరునే ఎక్కువగా ప్రపోజ్ చేస్తున్నారు. సో ఏ రకంగానూ చూసినా రేవంత్ టైటిల్ విన్నర్ గా నిలవడం ఖాయమని అంటున్నారు.
ఇక రన్నర్ కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ నెలకొనబోతుందట. మొన్నటి వరకు రేవంత్ విన్నర్ అయితే శ్రీహాన్ రన్నర్ అని అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ఇనయ ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో రన్నరప్ కోసం శ్రీహాన్, ఇనయ(Inaya) పోటీ పడబోతున్నారని తెలుస్తుంది. టాప్ 3లో ఈ ముగ్గురే ఉండే ఛాన్స్ ఉంది. టాప్ 5లో రేవంత్, శ్రీహాన్, ఇనయ, ఫైమా, ఆదిరెడ్డి నిలుస్తారని సమాచారం. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా నిలుస్తుంది. మరి ఇదే జరుగుతుందా? ఇందులో ఏమైనా ట్విస్టులు చోటు చేసుకుంటాయా అనేది చూడాలి.