MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • బిగ్‌ బాస్‌ షో పై విరుచుపడ్డ సీజన్‌ 5 విన్నర్‌ వీజే సన్నీ.. ఆ పేరు చెప్పుకోవడమే మానేశాడట..

బిగ్‌ బాస్‌ షో పై విరుచుపడ్డ సీజన్‌ 5 విన్నర్‌ వీజే సన్నీ.. ఆ పేరు చెప్పుకోవడమే మానేశాడట..

బిగ్‌ బాస్‌ రియాలిటీ షోపై గత ఐదో సీజన్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ.. ఈ రియాలిటీ షోపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిగ్‌ బాస్‌ విన్నర్‌ అని చెప్పుకోవడమే మానేశానంటూ షాక్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 05 2022, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్‌ బాస్‌(Bigg Boss) షో తరచూ వివాదాలకు కేరాఫ్‌గా మారుతుంటుంది. దీనిపై ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. బిగ్‌ బాస్‌ యువతని తప్పుదారి పట్టించేలా ఉందని, దీని వల్ల ఎవరికీ ప్రయోజనం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. సీపీఐ నాయకుడు నారాయణ తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే బిగ్‌ బాస్‌ విన్నరే ఈ షోపై విమర్శలు చేయడం సంచలనంగా మారాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బిగ్‌ బాస్‌ సీజన్‌ 6(Bigg Boss Telugu 6) ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా ఈ షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. గత మూడు సీజన్లకి నాగ్‌ వ్యాఖ్యాతగా చేస్తున్నారు. ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇందులో ఓ జంట ఉండటం విశేషం. ఫస్ట్ టైమ్‌ ఇంత భారీ ఎక్కువగా కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. సుమారు వంద రోజులపాటు ఈ షో రన్‌ అవుతుంటుంది. 
 

37

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ పై రచ్చ మరోసారి స్టార్ట్ అయ్యింది. దీనిపై కొందరు సామాజిక వేత్తలు స్పందిస్తూ విమర్శిస్తున్నారు. కానీ గత సీజన్‌ విన్నర్‌(Bigg Boss 5 Winner) వీజే సన్నీ(Vj Sunny) సైతం ఈ రియాలిటీ షోపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ షో వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం షాకిస్తుంది. వీడియో జాకీగా రాణించే సన్నీ `బిగ్‌ బాస్‌ సీజన్‌ 5`లో సందడి చేశారు. టైటిల్‌ గెలుసుకున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుని దూసుకెళ్తున్నారు. ఈ షోతోనే బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు సన్నీ. 

47

సన్నీ చేతిలో మూడు సినిమాలు, ఓ వెబ్‌ సిరీస్‌ కూడా ఉంది. ఇవన్నీ ఆయనకు `బిగ్‌ బాస్‌ 5` పూర్తయిన తర్వాతే రావడం విశేషం. కానీ ఈ షో వల్ల ఉపయోగం లేదని, చాలా మంది ఈ షో గురించి కూడా తెలియదని, బిగ్‌ బాస్‌లో విన్నర్‌ అంటూ ఎవరూ పట్టించుకోలదని, అయితే ఏంటట అంటూ కామెంట్లు చేస్తున్నారని చెప్పారు వీజే సన్నీ. ఓస్టార్‌ డైరెక్టర్‌ కూడా తనని ఇలానే అడిగాడదని, అందుకే తాను బిగ్‌ బాస్‌ విన్నర్‌ అని చెప్పుకోవడం మానేశానని, సీరియల్‌ నటుడిని అని, సినిమాలు చేస్తున్నానని చెప్పుకుంటున్నట్టు తెలిపారు. 
 

57

బిగ్‌ బాస్‌ తర్వాత హీరోగా అవకాశాలు పొందిన వారిలో `సోహైల్‌, సన్నీ ప్రధానంగా ఉన్నారు. మిగిలిన వారంతా ఇంకా స్ట్రగులింగ్‌లోనే ఉన్నారు, వాళ్లకి ఏమాత్రం ఈషో ఉపయోగపడలేదనేలా ఉంది. ఎవరికీ షోకి వెళ్లొచ్చక సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీంతో వాళ్లు మళ్లీ స్ట్రగులింగ్ లోనే ఉంటున్నారు. మచ్చా..మచ్చా అంటూ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో రచ్చ చేసి విన్నర్‌గా నిలిచిన సన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు షాకిస్తుంది. బిగ్‌ బాస్‌ తెలుగు 6పై ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

67

బిగ్‌ బాస్‌ రియాలిటీ షో హిందీ తర్వాత తెలుగులో ప్రారంభమైన విషయం తెలిసిందే. పాపులర్‌ రియాలిటీ షోగా రన్‌ అవుతుంది. దీనికి మంచి ఆదరణ దక్కుతుంది. తొలి సీజన్‌ ఎన్టీఆర్‌ హోస్ట్ గా చేయగా, రెండో సీజన్‌కి నాని, మూడు నాలుగు, ఐడు, ఆరు సీజన్లకి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఆ మధ్య ఓటీటీలోనూ షో రన్‌ అయ్యింది. అందులో బిందుమాధవి విన్నర్ అయ్యారు. మొదటి సీజన్‌లో శివబాలాజీ, రెండో సీజన్‌లో కౌశల్‌, మూడో సీజన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, నాల్గో సీజన్‌లో అభిజిత్‌,ఐదో సీజన్‌లో సన్నీ విన్నర్‌ అయ్యారు. 

77

ప్రస్తుతం సన్నీ హీరోగా మూడు సినిమాలు చేస్తుండటం విశేషం. సప్తగిరితో కలిసి `అన్‌ స్టాపబుల్‌` అనే కామెడీ సినిమా చేస్తున్నారు. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే `ఏటీమ్‌` అనే వెబ్‌సిరీస్‌, `సకల గుణాభి రామ` వంటి చిత్రాలు చేస్తున్నారు సన్నీ. ఇది ఈ నెల 16న విడుదల కాబోతుంది.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా
Recommended image2
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image3
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved