- Home
- Entertainment
- శ్రీరామ్ కి హమీద బానిస.. టార్గెట్ చేసిన షణ్ముఖ్, మానస్.. సర్ ప్రైజ్ చేసిన క్రిష్, వైష్ణవ్ తేజ్
శ్రీరామ్ కి హమీద బానిస.. టార్గెట్ చేసిన షణ్ముఖ్, మానస్.. సర్ ప్రైజ్ చేసిన క్రిష్, వైష్ణవ్ తేజ్
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. నేడు శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడుతూనే అడగాల్సిన ప్రశ్నలు సంధించారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. నేడు శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడుతూనే అడగాల్సిన ప్రశ్నలు సంధించారు. నేటి ఎపిసోడ్ ప్రారంభం అయ్యాక కైగర్ కారు గురించి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇస్తారు. కారు గురించి ప్రశ్నలకు సంబంధించిన టాస్క్ అది. ఈ టాస్క్ సరదాగా సాగుతుంది.
టాస్క్ తర్వాత విశ్వకు, ప్రియకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ప్రియా తనని అనవసరంగా టార్గెట్ చేస్తూ వెంటపడుతోంది అంటూ విశ్వ ఆరోపిస్తాడు. దీనితో నోటిని అదుపులో పెట్టుకో అంటూ ప్రియా విశ్వకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నాగ్ ఇంటి సభ్యులతో ఇంటరాక్ట్ అవుతారు. ఒక్కో ఇంటి సభ్యుడిని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. నీకు బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా..హమీదా ముఖ్యమా అంటూ నాగ్ శ్రీ రామ్ ని ప్రశ్నిస్తాడు. దీనితో శ్రీరామ్ తనకు బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమని చెబుతాడు.
హౌస్ మేట్స్ కి నాగార్జున చిన్న సర్ ప్రైజ్ ఇస్తారు. కొండపొలం దర్శకుడు క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్ వేదికపైకి అతిథులుగా వస్తారు. ఈ సందర్భంగా నాగార్జున వారిద్దరిని కొండపొలం విశేషాలు అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత నాగార్జున తాను అడగాల్సిన ప్రశ్నలని క్రిష్, వైష్ణవ్ చేత హౌస్ మేట్స్ ని అడిగిస్తాడు. క్రిష్ హౌస్ మేట్స్ ని ప్రశ్నిస్తూనే సరదాగా మాట్లాడతారు. ఇంతకు ముందు శ్రీరామ్.. బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా.. హమీదా ముఖ్యమా అని అడిగితే బిగ్ బాస్ టైటిల్ ముఖ్యం అని చెప్పారు. నేనైతే హామీదనే ముఖ్యం అని చెప్పేవాడిని అంటూ క్రిష్ నవ్వులు పూయిస్తాడు.
ఆ తర్వాత లోబో.. కాజల్ కు మిడిల్ ఫింగర్ చూపించడం పై చర్చ జరుగుతుంది. తాను ఉద్దేశ పూర్వకంగా అలా చేయలేదని.. పైన బల్లి వెల్తుంటే చూపించానని లోబోచెప్పడంతో నాగ్ కన్విన్స్ అవుతారు. ఇక నాగార్జున ఇంటి సభ్యులచేత చిన్న గేమ్ ఆడిస్తాడు. ఈ గేమ్ ప్రకారం ఇంట్లో రూలర్ లా బిహేవ్ చేసేవారు.. బానిసలుగా ఉండేవారు ఎవరో చెప్పాలి. ఒక్కో ఇంటి సభ్యుడు ఇలా రూలర్, బానిస ఎవరో చెప్పాలి. కారణం చెబుతూ రూలర్ కి కిరీటం,బానిసను చిన్న కిరీటం అమర్చాలి.
ఈ గేమ్ ని ప్రియా మొదలు పెడుతుంది. ఆమె శ్రీ రామ్ కి రూలర్ కిరీటం.. హామీదకు స్లేవ్ కిరీటం ఇస్తుంది. ఇక ప్రియాంక రూలర్ గా రవిని, స్లేవ్ గా లోబోని ఎంచుకుంటుంది. ఇదిలా ఉండగా మానస్, షణ్ముఖ్ ఇద్దరూ హామీదని స్లేవ్ గా ప్రకటిస్తారు.ఆమె శ్రీరామ్ కి ఎక్కువఆ కనెక్ట్ అవుతూ గేమ్ నెగ్లెక్ట్ చేస్తోంది అని చెబుతారు. షణ్ముఖ్ అయితే నాకు హౌస్ లో హమీదా కనిపించడం లేదు.. 14 మంది మాత్రమే ఉన్నారనిపిస్తోంది అంటూ హమీదాపై సెటైర్లు వేస్తాడు. దీనితో హమీద అసలు నువ్వాడుతున్నావా గేమ్ అంటూ షణ్ముఖ్ కి కౌంటర్ ఇస్తుంది.
ఇక విశ్వ.. ప్రియని స్లేవ్ గా ప్రకటిస్తాడు. దీనితో నాగ్ ముందే వారిద్దరికి మరోసారి వాగ్వాదం జరుగుతుంది. ఇంతలో నాగ్ నామినేషన్స్ లో ఉండే వారిని నిల్చోమని చెబుతారు. నామినేషన్స్ లో ఉన్న మానస్, సన్నీ, విశ్వ, హమీద, ప్రియా, జెస్సి, షణ్ముఖ్, రవి, లోబో నిల్చుంటారు. దీనితో ఈరోజు ఎవ్వరూ సేవ్ కావడం లేదు.. రేపు చూద్దాం అని నాగ్ ట్విస్ట్ ఇస్తారు. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.