బిగ్ బాస్ 3: గుక్క పెట్టి ఏడ్చేసిన శ్రీముఖి..!

First Published 21, Sep 2019, 7:47 AM IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 61 ఎపిసోడ్‌లను పూర్తి చేసి శుక్రవారం నాటితో 62వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
 
బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారం పూర్తి చేసుకోనుంది. 17 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం పది మంది మాత్రమే మిగిలారు. శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్ గా సాగింది. హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్స్ తరుపున 10 మంది ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు.

ఈ పది మందిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను కలిసే అవకాశాన్ని ఇద్దరి మాత్రమే ఇచ్చారు. పది మందిలో ఐదుగుర్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేయగా.. వితిక, శివజ్యోతి, రవి, పునర్నవి, హిమజ కుటుంబ సభ్యులు ఎంపికయ్యారు.

వితికా తరుపున అతని అన్నయ్యకు తొలి అవకాశం లభించగా.. రవి మావయ్యకు రెండో అవకాశం లభించింది. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన ఈ ఇద్దరూ సీక్రెట్‌ రూంలో వితికా, రవిలను కలిసి బయట పరిస్థితులను వివరించి కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో రవి, వితికా బాగా ఎమోషనల్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా.. శ్రీముఖి తన తమ్ముడు సుసృత్ ని చూసుకొని ఏడ్చేసింది. కానీ తమ్ముడిని కలిసే అవకాశం రాకపోవడంతో శ్రీముఖి బాగా ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ ప్లీజ్.. ఒక్కసారి చూసే ఛాన్స్ ఇవ్వండి కనీసం చూస్తా.. మాట్లాడను అంటూ గుక్క పెట్టి ఏడ్చేసింది. ఇక శివజ్యోతి కూడా తన అన్నను కలుసుకునే అవకాశం మిస్ అవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంది.

బిగ్ బాస్ ఇస్తే అందరికీ అవకాశం ఇవ్వాలి తప్ప ఇలా 10 మందిలో ఇద్దరికి మాత్రమే కంటెస్టెంట్స్‌ను కలిసే అవకాశాన్ని ఇచ్చి మిగిలిన వారిని ఏడిపించడం కరెక్ట్ కాదని.. శ్రీముఖి, శివజ్యోతిలు ఫీల్ అయ్యారు.

loader