ఎదుటి వారి కాన్ఫిడెన్స్‌ను చంపేస్తావ్.. శ్రీముఖిపై విరుచుకుపడ్డ శివజ్యోతి!

First Published 23, Sep 2019, 11:20 PM

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 64 ఎపిసోడ్‌లను పూర్తి చేసి సోమవారం నాటితో 65వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
 
బిగ్ బాస్ సీజన్ 3 పదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారం నాటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ముందుగా ఈ ఎపిసోడ్ ఆరంభంలో శ్రీముఖి, బాబా భాస్కర్ ల మధ్య సరదా సంభాషణ సాగింది.

ఇక పునర్నవి.. రాహుల్ ని కలవరిస్తూ అతడి కోసం పాట పాడుతుండగా.. రాహుల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా రాహుల్ తన వాయిస్‌తో ప్రేమ సందేశం పంపగా.. ఆనందంతో గంతులు వేసింది పునర్నవి. రాహుల్ హౌస్‌లోకి అడుగుపెట్టగానే పరుగున వెళ్లి ఎప్పటిలాగే తన కౌగిలిలో బంధీ చేసుకుంది పునర్నవి.

దీనిలో భాగంగా హౌస్ మేట్స్ ని జంటలుగా విడగొట్టి వారి మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. జంటలుగా విడగొట్టిన వారిని హాట్ సీట్ లో కూర్చోపెట్టి ఇద్దరూ తమ బలాల గురించి మాట్లాడుతూ హౌస్ లో ఉండడానికి అర్హులా కాదా..? అనే విషయం గురించి మాట్లాడాలి.

అయితే ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే సేవ్‌ అవుతారనే కండీషన్‌ పెట్టారు. ఈ క్రమంలో శివజ్యోతి-శ్రీముఖిల మధ్య భీకర మాటల పోరు జరిగింది. శివజ్యోతి ఎమోషనల్ పర్సన్ అని అదే వీక్‌నెస్‌ అంటూ శ్రీముఖి నామినేట్‌ చేయగా.. ఎదుటి వారి కాన్ఫిడెన్స్‌ను చంపి గేమ్‌ ఆడేదానివంటూ శివజ్యోతి.. శ్రీముఖిపై విరుచుకుపడింది.

వీరిద్దరిలో హౌస్ మేట్స్ ఎక్కువ ఓట్లు శివజ్యోతికి పడడంతో ఈ వారం ఆమె సేవ్ అవ్వగా.. శ్రీముఖి నామినేట్ అయింది. అలానే రవి, వితికాలలో వితికా సేవ్ అవ్వగా.. పునర్నవి, బాబా భాస్కర్ లలో పునర్నవి సేవ్ అయింది.

రాహుల్, వరుణ్ లలో రాహుల్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. మొత్తంగా ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఇంటి సభ్యులు శ్రీముఖి, వరుణ్, రవి, బాబా భాస్కర్ లు. వీరిలో ఈ వారం బయటకి వెళ్లేదెవరో చూడాలి!

loader