- Home
- Entertainment
- Bhumika Chawla : ‘మాట్లాడే ముందు జాగ్రత్తా’ అంటున్న ‘భూమిక చావ్లా’.. ఫొటోషూట్ తో అట్రాక్ట్ చేస్తోంది..
Bhumika Chawla : ‘మాట్లాడే ముందు జాగ్రత్తా’ అంటున్న ‘భూమిక చావ్లా’.. ఫొటోషూట్ తో అట్రాక్ట్ చేస్తోంది..
భూమిక (Bhumika Chawla) తన ఫాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోంది. తన గ్లామర్, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుందీ సుందరి. తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ మూవీతో పాపులారిటీని సొంతం చేసుకుంది భూమిక చావ్లా. ఆ ఒక్క మూవీతో తన క్రేజ్ మామూలుగా పెరగలేదు. అంతకు ముందు తెలుగులో ‘యువకుడు’మూవీతో గ్లామర్ ఫీల్డ్ కు ఎంట్రీ ఇచ్చింది.
ఖుషీ మూవీ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ ను ఒక్క ఊపూపింది భూమిక. తన క్రేజ్ కు అటు తమిళ్, హిందీ, మళయాళం భాషల్లో తెరకెక్కిన మూవీల్లోనూ అవకాశాలు దక్కించుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
ఫ్యామిలీ హీరోయిన్ గానూ, యూత్ లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న భూమిక. కొన్నాళ్లు హీరోయిన్ గా టాలీవుడ్, బాలీవుడ్ ను ఊపూపగా, ప్రస్తుతం సపోర్టెడ్ రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తోంది.
సపోర్టింగ్ క్యారెక్టర్స్, హీరోయిన్ ఓరియేంటెడ్ మూవీలతో తన సత్తా చాటుతోంది. పలు కీలక పాత్రల్లో కనిపిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ప్రధాన పాత్రలను ఎంచుకుంటూ తన కేరీర్ ను కొనసాగిస్తోంది.
2017లో రిలీజ్ అయిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ మూవీతో నానికి వదిన పాత్రలో, యూ టర్న్, సవ్యసాచి, రూలర్, పాగల్ లాంటి మూవీల్లో ప్రత్యేక రోల్స్ ను పోషించింది. చివరిగా గోపీచంద్ నటించిన‘సిటీమార్’మూవీలోనూ నటించింది.
అటు సినిమాల్లోనూ అలరిస్తూనే, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది భూమిక. తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇప్పటికీ న్యూ ఫొటోషూట్ ద్వారా భూమిక తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. అదేవిధంగా ‘మీరు మాట్లాడేప్పుడు పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఆ పదాలను ఇతరుల కోసం ఉపయోగించేనా, మీ కోసం ఉపయోగించినా అవి కచ్చితంగా జరిగి తీరుతాయి’ అంటూ పేర్కొంది.