- Home
- Entertainment
- Bhumi Pednekar : నెట్ సారీలో అదిరిపోయిన బాలీవుడ్ నటి ‘భూమి పెడ్నేకర్’.. ఆకట్టుకుంటున్న సారీ..
Bhumi Pednekar : నెట్ సారీలో అదిరిపోయిన బాలీవుడ్ నటి ‘భూమి పెడ్నేకర్’.. ఆకట్టుకుంటున్న సారీ..
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ స్టైలే వేరు. తన గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేయడంలో ఈ సొగసరి ముందుంటుంది. తన నెక్ట్స్ మూవీ ‘బదాయి దో’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా భూమి ధరించిన నెట్ సారీ అందరినీ ఆకట్టుకుంటోంది.

హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది నటి భూమి పెడ్నేకర్. అయితే ఆరేండ్ల పాటు యష్ రాజ్ ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ బ్యూటీ నటిగా అవతారం ఎత్తింది.
రొమాంటిక్ కామెడీ ‘దమ్ లగా కే హైషా’లో విభిన్న పాత్ర పోషించి నటిగా ప్రేక్షకులకు పరిచయమైంది. ఇది తనకు తొలి సినిమా అయినా చక్కగా నటించింది. ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ హెవీ వెయిట్ లో కనిపిస్తుంది.
అధిక బరువు గల వధువుగా పాత్రలో అఆయుష్మాన్ ఖురానాకు జోడిగా నటించి మెప్పించింది. ఈ పాత్రలో తను నవ్వులు పూయించింది. ఆ తర్వాత భూమి తన వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా కష్టపడింది అంత త్వరగా వెయిట్ లాస్ అవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మూవీతో తనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు దక్కింది.
ప్రస్తుతం భూమి పెడ్నేకర్ తన నెక్ట్స్ మూవీ 'బదాయి దో'తో అలరించనుంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావుకు జంటగా నటిస్తోంది. కాగా హర్షవర్దన్ కులకర్ణి దర్శకత్వం వహిస్తున్నారు. వినీత్ జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్లు, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ రిలీజైన పది రోజుల్లో 20 మిలియన్ల వ్యూస్ తో య్యూటూబ్ లో దూసుకుపోతోంది. మూవీలో భూమి ఒక లెస్బియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సుమీ పాత్రను పోషించింది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా భూమి పెడ్నేకర్ తాజాగా ఓ ఫొటో షూట్ చేసింది. లగ్జరీ డిజైనర్ లేబుల్ అబు జానీ సందీప్ ఖోస్లా ఈ నెట్ సారినీ డిజైన్ చేశారు. వివిధ భాషల్లో సారీపై పలు పదాలను ఉండటంతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ‘రోమాన్స్, లవ్’ వంటి తమిళ పదాలు సారీపై ఉండటంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫొటోలను పోస్ట్ చేసి తన అభిమానులను ఆకట్టుకుంటోందీ భూమి. బిగుతైన జాకెట్ తో తన ఎదఅందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చి కుర్రాళ్లను కట్టి పడేస్తోంది. ఈ ఫొటోలకు ‘ప్యార్, ఇష్క్, మహబత్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘బదాయి దో’చిత్రంలో సీమా పహ్వా, షీబా చద్దా, లవ్లీన్ మిశ్రా, నితేష్ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 11న థియేటర్లలోకి రానుంది.